Begin typing your search above and press return to search.
ట్రంప్ కన్నేసి కొంటానన్నాడు.. ఆ దేశం నో చెప్పింది..
By: Tupaki Desk | 17 Aug 2019 7:47 AM GMTగ్రీన్ లాండ్.. అమెరికా, యూరప్ ఖండాల మధ్యన ఉత్తరాధ్ర గోళానికి అనుకోని ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం. ఇక్కడ జనాభా కేవలం 57వేల మందే.. ఎందుకంటే ఈ దేశం మొత్తం మంచుమయం.. ఉపరితలం నుంచి దాదాపు 3కి.మీల మందంతో మంచు కప్పబడి ఉంటుంది. ఆ 57వేల మంది కూడా తీరప్రాంతాల్లో దక్షిణ దృవానికి సముద్రంలో కలిసే చోట ఉంటారు..
ఇక పక్కనే ఉన్న అమెరికా కు గ్రీన్ లాండ్ లోని తూలేలో వైమానిక స్థావరం ఉంది. అయితే గ్రీన్ లాండ్ దేశం ప్రస్తుతం డెన్మార్క్ దేశం ఆధీనంలో ఉంది. గ్రీన్ లాండ్ కు స్వయం ప్రతిపత్తిని డెన్మార్క్ ఇచ్చి ప్రత్యేక దేశంగా ప్రకటించింది.
దాదాపు 20లక్షల చదరపు కి.మీల భారీ విస్తీర్ణం ఉన్న గ్రీన్ లాండ్ ఉత్తరదృవానికి దగ్గరగా ఉండడంతో మంచుతో కప్పబడి ఉంది. అదే కొంచెం కిందకు ఉంటే మాత్రం మరో జనావాస దేశంగా అందుబాటులో ఉండేది. కొన్ని లక్షల ఏళ్ల క్రితం గ్రీన్ లాండ్ కూడా పచ్చటి నేలలున్న ప్రాంతమే. కానీ క్రమంగా ఉత్దరదృవంవైపు కదిలి ఇప్పుడు మంచుతో కప్పబడి ఉంది.
అయితే ఆ మంచు కింద అపార, అరుదైన ఖనిజాలు ఎన్నో ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. విస్తారమైన హైడ్రోకార్బన్ లు తీరప్రాంతంలో అపార నిక్షేపాలున్నట్టు పరిశోధకులు తేల్చారు. కానీ మంచుతో కప్పబడి ఉండడంతోపాటు గ్రీన్ లాండ్ దేశంలో జనాభా లేకపోవడం.. డెన్మార్క్ ఒప్పుకోకపోవడంతో వెలికితీయడం లేదు.
అయితే గ్రీన్ లాండ్ పక్కనే ఉండే అమెరికా ఈ దేశంపై కన్నేసింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ అతిపెద్ద ద్వీప దేశాన్ని కొంటామని.. ఎంత కావాలో చెప్పాలంటూ ఆ దేశానికి ఆఫర్ ఇచ్చాడు. అపార ఖనిజ , సహజ వనరులను సొంతం చేసుకోవాలనే ఆశతోనే ఈ వల విసిరినట్టు సమాచారం. ఇప్పటికే గ్రీన్ లాండ్ పై అమెరికా కన్నేసిందని ప్రఖ్యాత వెబ్ సైట్ వికీలీక్స్ బయటపెట్టింది. ఇప్పుడు ట్రంప్ ఆఫర్ ఇవ్వడంతో ఆ ప్రచారం నిజమైంది.
కాగా ట్రాప్ దుర్భిద్ధి ప్రతిపాదనను గ్రీన్ లాండ్ తిరస్కరించింది.గ్రీన్ లాండ్ విదేశాంగ శాఖ ఈ మేరకు గ్రీన్ లాండ్ ను అమ్మమంటూ స్పష్టం చేసింది.