Begin typing your search above and press return to search.
ఐసీసీ చైర్మన్‌గా మళ్లీ అతడే.. రేసులో లేని గంగూలీ!
By: Tupaki Desk | 12 Nov 2022 8:54 AM GMTఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన మళ్లీ గ్రెగ్ బార్‌క్లే మరోసారి ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్ బార్‌క్లేను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్ క్లే 2020 నవంబరులో తొలిసారిగా ఐసీసీ చైర్మన్ అయ్యారు. 2022 నవంబరుతో ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించారు.
ఐసీసీ చైర్మన్ పదవికి జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ కూడా పోటీ చేసినా చివరలో ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సహా 17 మంది ఐసీసీఐ బోర్డు సభ్యులు గ్రెగ్ బార్‌క్లేకు మద్దతిచ్చారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాగా గ్రెగ్ బార్‌క్లే గతంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. అంతకుముందు 2015లో ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.
అంతా అనుకున్నట్లుగానే భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యర్ధిని నిలబెట్టలేదు. బీసీసీఐ.. తొలుత మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బరిలోకి దింపాలని భావించింది. అయితే ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంది. 17 మంది సభ్యులున్న ఐసీసీ బోర్డులో బీసీసీఐ సహా 17 మంది సభ్యులు బార్‌క్లేకు మద్దతు ప్రకటించారు.
2020 నవంబర్‌లో తొలిసారి ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన గ్రెగ్ బార్‌క్లే ఈ పదవిలో మరో రెండేళ్లు కొనసాగనున్నాడు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఇవాళ జరిగిన ఐసీసీ మీటింగ్‌కు భారత్ తరఫున బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా హాజరయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.