Begin typing your search above and press return to search.

పిల్ల కాదు పిడుగు.. ట్రంప్ కు పంచ్ ఇస్తూ ట్వీట్ రిటార్ట్

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:17 AM GMT
పిల్ల కాదు పిడుగు.. ట్రంప్ కు పంచ్ ఇస్తూ ట్వీట్ రిటార్ట్
X
తాను పిల్లను కాదు పిడుగునన్న విషయాన్ని తన మాటలతోనూ.. చేతలతోనూ మరోసారి నిరూపించారు పర్యావరణంపై పోరాడుతున్న టీనేజర్ గ్రెటా థన్ బర్గ్. ప్రపంచ దేశాల్లో పర్యావరణంపై ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇలాంటివేళ.. ఆమెకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని తెలివిగా డీల్ చేయటమే కాదు అమెరికా అధ్యక్షుడికే దిమ్మ తిరిగేలా ట్వీట్ పంచ్ ఇచ్చిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

పర్యావరణం మీద పోరాటం చేస్తున్న యువ కార్యకర్త గ్రెటాకు ప్రఖ్యాత పత్రిక టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. దీనిపై ఇప్పటికే కొందరు విమర్శించారు. తాజాగా ఆ జాబితాలో చేరారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అదో తెలివితక్కువ నిర్ణయంగా ఆయన విమర్శించటమే కాదు.. గ్రెటా తీరును తప్పు పడుతూ ఆమెను ఎటకారం ఆడేశారు.

గ్రెటా ముందు తన కోపాన్ని అదుపులో ఉంచుకోవటంపై దృష్టి పెట్టాలి.. ఓ ఫ్రెండ్ తో కలిసి మంచి సినిమాకు వెళ్లాలి.. చిల్.. గ్రెటా చిల్ అంటూ ట్వీట్ చేశారు ట్రంప్.దీనికి బదులుగా గ్రెటా ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యింది. ట్రంప్ కు షాకిస్తూ.. ఆయన చేసిన ఎటకారానికి ధీటుగా బదులిచ్చింది. నేను కోపాన్ని అదుపులో పెట్టుకోవటంపై దృష్టి పెట్టిన ఒక టీనేజర్ ను.. ప్రస్తుతం ఒక ఫ్రెండ్ తో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. గ్రెటా స్పందన ఇప్పుడు పలువురిని విపరీతంగా ఆకర్షిస్తోంది.ఇదంతా చూసినప్పుడు గ్రెటా పిల్ల కాదు పిడుగు అన్న భావన కలుగక మానదు.