Begin typing your search above and press return to search.

పెళ్లి కొడుకే.. ఎంత హడావుడి చేశాడంటే..

By:  Tupaki Desk   |   1 March 2017 10:04 AM IST
పెళ్లి కొడుకే.. ఎంత హడావుడి చేశాడంటే..
X
పెళ్లిలో పెళ్లి కొడుకు ఎంత ఉత్సాహంగా ఉంటాడో తెలిసిందే. సూట్ వేసుకొని.. మెడలో పూల దండ వేసుకొని.. కాబోయే శ్రీమతి పక్కనున్న వేళ.. బంధు మిత్రులంతా చుట్టూ చేరిన వేళ.. హుందాగా ఉంటూ.. చిరునవ్వులు చిందిస్తూ ఉండటం పరమ వీర రోటీన్ ముచ్చట. కానీ.. అందుకు భిన్నంగా.. తన స్నేహితులతో కలిసి ఇరగదీసేలా చిందేయటం సరికొత్తది.

అందరూ చూస్తున్నారన్న ఫీలింగ్ ఏమి లేకుండా.. స్నేహితులతో కలిసి సరదాగా.. పక్కా లోకల్ మాస్ స్టెప్పులు వేయటం కాస్త కొత్త కాన్సెప్ట్ అనే చెప్పాలి. తాజాగా అలాంటి పనే చేశాడో పెళ్లి కొడుకు. తమిళనాడుకు చెందిన పెళ్లికొడుకుగా అనుకుంటున్నప్పటికీ.. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. కేవలం రెండు నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న ఈ చిట్టి వీడియోలో.. అదరగొట్టేసే స్టెప్పులు వేసేశాడీ పెళ్లికొడుకు.

ఉరిమే ఉత్సాహం అంటారే.. ఆ మాటకు సరిగ్గా సూట్ అయ్యేలా అతగాడి డ్యాన్సుల యవ్వారం ఉందని చెప్పాలి. ఫ్రెండ్స్ తో కలిసి ఉత్సాహంతో..అదరగొట్టే ఎనర్జీతో అతగాడు వేస్తున్న స్టెప్పుల్ని.. పెళ్లిని చూడటానికి వచ్చిన వారి మొదలు.. పెళ్లి కూతురు వరకూ జస్ట్ అలా చూస్తుండిపోయిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్ లైన్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన రెండు రోజులకే 30 లక్షల మంది చూడటం ఒక విశేషంగా చెప్పాలి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లికొడుకు సరదాగా వేసిన స్టెప్పులన్నీ ఎనర్జిటిక్ గా ఉండటమే కాదు.. పక్కాగా ఉండటం ఒక విశేషం. ఇక.. ఈ వైరల్ వీడియో గురించి కోయంబత్తూరుకు చెందిన డానియల్ జోసెఫ్ నితిన్ ఫేస్ బుక్ యూజర్ రియాక్ట్ అవుతూ.. డ్యాన్స్ చేసిన పెళ్లికొడుకు పేరు శాండీ అని.. అతనికో డ్యాన్స్ స్కూల్ ఉందని.. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి ఇద్దరు యాక్టర్లను పరిచయం చేశాడని చెప్పుకొచ్చారు. ఇక.. ఈ వీడియోను చూసిన చాలామంది.. పెళ్లికొడుకు మాదిరి ఉత్సాహంతో స్టెప్పులు వేయాలన్న అభిలాషను వ్యక్తం చేయటం గమనార్హం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/