Begin typing your search above and press return to search.

పబ్ జీ పిచ్చ.. శోభనం కూడా చెయ్యడేమో

By:  Tupaki Desk   |   30 April 2019 4:59 AM GMT
పబ్ జీ పిచ్చ.. శోభనం కూడా చెయ్యడేమో
X
పబ్ జ్, టిక్ టాక్ ఇలా ఆన్ లైన్ గేములు, సోషల్ మీడియా యాప్ లు యువతను బానిసగా మారుస్తున్నాయి. పబ్ జీ అదేపనిగా ఆడి జగిత్యాలలో ఒక యువకుడి మెడ నరాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ గేములు వ్యసనంగా మారి బంధుత్వాలను దూరం చేస్తున్నాయి. ఒంటరి జీవితాన్ని అలవాటు చేస్తున్నారు. ఒక విచిత్రలోకంలోకి బాధిత యువతను తీసుకెళ్లి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రస్తుత యువత పబ్ జీ పట్ల ఉన్న వ్యసనాన్ని తేటతెల్లం చేస్తోంది.. పెళ్లి అంటే ఎంత సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే.. బంధువులు, పూజలు, పునస్కారాలు, స్నేహితుల కోలాహలం అంతా ఉంటుంది. అయితే అవేవీ ఈ పెళ్లి కొడుకుని ఆకట్టుకోలేకపోయాయి. పెళ్లి మండపంలో ఉన్నా పక్కన పెళ్లి కూతురు ఉన్నా కూడా పబ్ జీ వ్యసనంలో పడి తన స్మార్ట్ ఫోన్ తీసి పబ్ జీ ఆడుకుంటూ ఉండిపోయాడు. పెళ్లి వచ్చిన బంధువులు బహుమతులు ఇవ్వబోతే పక్కకు తోసేసి మరీ తన మొబైల్ లో పబ్ జీ ఆడుతున్నాడు.

పెళ్లి కొడుకు ఇలా అంత పెద్ద ఫంక్షన్ లో పబ్ జీ ఆటలో మునిగిపోతే అతడిని ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో పాపం పెళ్లి కూతురు అలా చూస్తూ ఉండిపోయింది. ఇతడు ఎప్పుడు పబ్ జీ నుంచి బయటకు వస్తాడా అని ఎదురుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ జరిగిందో.. ఏం జరిగిందో కానీ పబ్ జీ వ్యసనాన్ని కళ్లకు కట్టినట్టు ఈ వీడియో చూపించింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తుస్తున్నారు. పెళ్లి పీటలమీదే పబ్ జీ ఆడుతున్న పెళ్లికొడుకు కనీసం శోభనం రోజు కూడా కార్యక్రమం కొనసాగిస్తాడా లేదా ఇలాగే ఆడుకుంటూ ఉంటాడా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.