Begin typing your search above and press return to search.
ఈ టైపు వరకట్నం చరిత్రలో ఇదే తొలిసారి!
By: Tupaki Desk | 25 Jun 2018 2:55 AM GMTదేశంలో వరకట్న వ్యవస్థ ఎంత వేళ్లూనుకుపోయిందంటే... ఎన్ని బలమైన చట్టాలు చేసినా వాటిని రూపు మాపలేకపోతున్నారు. అదంతా నెగెటివ్ సైడ్. ఒక భారీ వెరైటీ కట్నం అడిగి అందరి అభినందనలు అందుకున్నాడు. మామకు షాకిచ్చాడు. ఇంతకీ ఆయన అడిగిన కట్నం పిల్లనిచ్చిన మామ గారు తూచ తప్పకుండా పంపించారు. కట్నం తీసుకుని మెప్పు పొందిన ఆ వ్యక్తి ఎవంటే... ఒడిసాకు చెందిన 33 ఏళ్ల సరోజ్‌కాంత్ బిస్వాల్.
సరోజ్ కాంత్... ఒక టీచర్. ఫ్రెండ్ ఆఫ్ ట్రీ అనే ఒక స్వచ్చంద సంస్థ వాలంటీర్ కూడా. ఇది పర్యావరణ పరిరక్షణ సంస్థ. బిస్వాల్ పెళ్లి సమయంలో నేను కట్నం తీసుకోను అని మామకు- తండ్రికి విస్పష్టంగా చెప్పాడు బిస్వాల్. కానీ కట్నం తీసుకో అని తండ్రి పదేపేద చెప్పడంతో సహజంగా పర్యావరణ ప్రేమికుడైన అతనికి ఒక ఆలోచన వచ్చింది. తనకు 1001 మొక్కలు కట్నంగా ఇవ్వాలని మామను అడిగాడట. ఈ విచిత్రమైన డిమాండ్‌కు మామ షాక్ తిన్నాడు. సంతోషపడ్డాడు కూడా. అల్లుడు కోరికను పెళ్లికి రెండ్రోజుల ముందు తీర్చాడు. మామ ఇచ్చిన కట్నాన్ని మినీ లారీలో తీసుకెళ్లిన బిస్వాల్ తమ ఊరిలోని అన్ని ఇళ్లకు కలిపి 700 మొక్కలు పంచారట. మిగతా 301 మొక్కలు వధువు గ్రామంలో తన రిసెప్షన్ రోజు పంచి పెట్టాడట. ఇవన్నీ పళ్ల చెట్లే. ముందు నుంచే జనానికి బిస్వాల్ ఏంటో తెలిసి ఉండటం వల్ల పెద్దగా ఆశ్చర్యపోలేదు గాని చాలా సంతోషపడ్డారట.
వధువు కూడా కటక్ నగరంలో టీచరే. అతను నా అదృష్టం అంటూ మురిసిపోతోందావిడ. మామ బిస్వాల్ గురించి మాట్లాడుతూ మాటల్లో పర్యావరణం గురించి చాలామంది చెబుతారు. నా అల్లుడు చేతల్లో చూపించాడు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. బిస్వాల్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ నివారించడానికి తన పెళ్లిలో డీజేను, టపాసులను అస్సలు వాడనివ్వలేదట. ఈ కథనాన్ని ఒక ఆంగ్ల మీడియా ప్రచురించి తన సోషల్ మీడియా అక్కౌంట్లలో పెడితే... అందరూ విపరీతంగా షేర్లు, లైకులు చేస్తున్నారు.