Begin typing your search above and press return to search.

షాక్: వధువు తల్లి.. వరుడి తండ్రి అలా చేశారు

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:38 AM GMT
షాక్: వధువు తల్లి.. వరుడి తండ్రి అలా చేశారు
X
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. రోటీన్ కు భిన్నమైన ఈ వ్యవహారం గుజరాత్ లో చోటు చేసుకుంది. ఏడాది క్రితం ఒక జంటకు పెళ్లిచూపులు జరగటం.. సంబంధం ఓకే అనుకోవటం.. నిశ్చితార్థం చేసేసుకోవటం.. ఈ ఏడాది పెళ్లి అనుకోవటం జరిగిపోయాయి. ఇదంతా ఇలా ఉండగా.. ఊహించిన పరిణామం చోటు చేసుకుంది.

వారిద్దరి పెళ్లి మరో పది రోజులు ఉందన్న వేళ.. పెళ్లి కుమార్తె తల్లి.. పెళ్లి కుమారుడి తండ్రి ఇద్దరు కలిసి జంప్ అయిన వైనం అవాక్కు అయ్యేలా చేయటమే కాదు.. పెళ్లి రద్దు అయిపోయింది కూడా. గుజరాత్ లోని సూరత్ నగరానికి దగ్గర్లోని కట్టర్ గామ్ అనే ఊరుంది. ఆ ఊరికి చెందిన వ్యాపారి కమ్ రాజకీయ నేత పెళ్లికుమారుడి తండ్రి. ఆయన వయసు 48 ఏళ్లు. అతగాడి కొడుక్కి నవర్సీకి చెందిన అమ్మాయితో పెళ్లి ఖాయమైంది.

పెళ్లి చూపులు.. తర్వాత నిశ్చితార్థం వేళలో.. పెళ్లికుమారుడి తండ్రి.. పెళ్లి కుమార్తె తల్లి మధ్య పెరిగిన చనువు.. మరో స్టేజ్ కు వెళ్లటమే కాదు.. మరో పదిరోజుల్లో తమ పిల్లలకు పెళ్లి కావాల్సిన వేళ.. వారిద్దరు లేచివెళ్లిపోవటం స్థానికంగా పెను దుమారంగా మారింది. ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ ఏమంటే.. ఈ జంప్ అయిన జంట చిన్నతనంలో వారి ఇళ్లు పక్కపక్కనే ఉండేవట. అప్పుడు అనుకున్నది.. పిల్లల పెళ్లిళ్ల వేళ ఇలా తీర్చుకున్నారా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.