Begin typing your search above and press return to search.
నివురుగప్పిన నిప్పులా 'అనంత' టీడీపీ..
By: Tupaki Desk | 2 March 2019 6:13 AM GMTత్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా అధికార పార్టీ టీడీపీని గ్రూపు విభేదాలు కలవరపెడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ చార్జులకు ద్వితీయ శ్రేణి నాయకుల వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. వీరి శైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినా వారి నడవడిక మాత్రం మార్చుకోవడం లేదు. ఓ వైపు పార్టీ అధినేత బాబు ఎలాంటి విభేదాలకు పోకుండా నేతలంగా కలిసిపోవాలని సూచిస్తున్నా.. కొందరు పట్టించుకోకపోవడంతో వారిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారట.. .అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆ నాయకులు పనిచేయడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితి అనంతపురం జిల్లాలో మరీ ఎక్కువగా ఉంది.
అనంతపురం జిల్లాలోని టీడీపీ ప్రధాన నేతల మధ్య ఆధిపోత్య పోరు ఆగడం లేదు. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయడం అటుంచి వారిని ఎలాగైనా ఓడించాలనే వ్యూహం పన్నుతుండడం టీడీపీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆయన పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కోడెల అపర్ణ ఎమ్మెల్యేకు తెలియకుండానే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారట. అలాగే మైనార్టీ నాయకుడు భాషా ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా ఉంటూనే పార్టీ మారడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
రాప్తాడు నియోజకవర్గంలో ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళి - ప్రసాద్ కు మధ్య సమన్వయం చెదరడమే కారణమని స్థానికులు అంటున్నారు. కళ్యాణదుర్గంలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి ఒక వర్గం నాయకులు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ వర్గానికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ వర్గం ర్యాలీ కూడా తీసింది.
రాయదుర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి - కాలువ శ్రీనివాసులు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. కొన్ని కార్యక్రమాల్లో కలిసి కనిపించినా లోలోపల మాత్రం ఒకరిపై ఒకరిపై కత్తులు దూసుకుంటున్నారు. . బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించే హిందుపురంలో పైకి బాగానే కనిపించినా నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వెళ్లింది.
ఇదిలా ఉండగా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తాము టీడీపీ నాయకులమని చెబుతూనే పార్టీలో కనిపించడం లేదు. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పోనీ ఇతర పార్టీల్లో చేరుతారా..? అంటే అదీ లేదు. వీరంతా ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదీ నుంచి టీడీపీ నాయకుడే అని చెప్పుకుంటున్నా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. వీరంతా అదును చూసి టీడీపీ దెబ్బకొట్టడానికి రెడీ అయ్యారట.. దీంతో అనంతపురంలో ఈసారి టీడీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు.