Begin typing your search above and press return to search.
సీమలో 'దేశా'నికి తలనొప్పులు
By: Tupaki Desk | 7 Jan 2019 5:54 AM GMTలోక్ సభ - ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్దానాలకు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో నాలుగు నెలలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు పెరగనుంది. ఈ దశలో అధికార తెలుగుదేశం పార్టీకి రాయలసీమ జిల్లాలలో కష‌్టాలు ఎదురవుతున్నాయంటున్నారు. అనంతపురం - చిత్తూరు జిల్లాలకు మాత్రమే పరిమితమైన తెలుగు తమ్ముళ్ల ఇంటి పోరు కడప - కర్నూలు జిల్లాలకు కూడా పాకిందంటున్నారు. అనంతపురం జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ఐదు గ్రూపులు, ఆరు కుమ్ములాటలుగా మారింది. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరిన జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కొరక రాని కొయ్యలుగా మారారంటున్నారు. అనంతపురం జిల్లాలలో పార్టీ శాసన సభ్యులు - నాయకులు - కార్యకర్తల మధ్య జేసీ బ్రదర్స్ చిచ్చు పెడుతున్నారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రోజుకో వివాదంతో జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడికి తలనొప్పులు తీసుకుని వస్తున్నాయని అంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి కాల్వ శ్రీనివాస్ తప్ప వచ్చే ఎన్నికలలో ఎవరు గెలవరంటూ జేసీ దివాకర్ రెడ్డి పలుమార్లు ప్రకటిస్తున్నారు. ఇది జిల్లా నాయకులకు మింగుడు పడడం లేదు. ఈసారి సిట్టింగ్ లను మారిస్తేనే గెలుపు దక్కుతుందంటూ జేసీ బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో దుమారం రేపాయి.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా పార్టీ పరిస్థితి అలాగే ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారంటూ పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడిని బూచిలా చూపిస్తున్నారు స్దానిక నాయకులు. జిల్లాకు చెందిన గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు కుటుంబం ఇప్పటికే వివాదాలతో రోడ్డున పడింది. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. కర్నూలు జిల్లాలో సీనియర్ నాయకుడు కేఈ క్రిష్ణమూర్తి - భూమా అఖిలప్రియ వర్గాలకు చెందిన వారు పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కర్నూలు పర్యటనలో ఒకరిద్దరి అభ్యర్దులను ప్రకటించారు. ఆరోజు నుంచి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. తాజాగా మంత్రి అఖిలప్రియ తన కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో తనకు కేటాయించిన భద్రతా సబ్బందిని వెనక్కి ఇచ్చేసారు. ఈ వివాదం ముదిరి పాకాన పడుతుందని జిల్లా తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఇక కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ గడ్డు కాలమే. ఈ జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాయలసీమ జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా సీట్లు దక్కే అవకాశం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు.