Begin typing your search above and press return to search.

కొవ్వూరులో కొట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   24 Feb 2019 8:46 AM GMT
కొవ్వూరులో కొట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
X
నెల్లూరులో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కోవూరు టికెట్ కోసం టీడీపీలో కొట్లాట మొదలైంది. సొంత పార్టీ నేతలే సీఎంకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు ఆశావహులు కోవూరు టికెట్ కోసం పోటీపడగా.. ముచ్చగా ఇప్పుడు మూడో కృష్ణుడు తెరపైకి వచ్చాడు. దీంతో కోవూరు టీడీపీ టికెట్ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇది తిరుగుబాటుకు దారితీస్తోంది.

కోవూరు టీడీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే అసమ్మతి వర్గం నాయకుడు టీడీపీ నేత పెళ్లకూరు తాజాగా చంద్రబాబును కలిసి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరాడు. దీనిపై వచ్చేవారం నిర్ణయిస్తానని బాబు సెలవిచ్చాడట..

తాజాగా మరో టీడీపీ నేత యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా శనివారం టీడీపీ టికెట్ తనదేనంటూ విలేకరుల ఎదుట తొడగొట్టారు. పార్టీలో సీనియర్ తాను అని.. ఎమ్మెల్యే పోలంరెడ్డి , టీడీపీ నేత పెళ్లకూరు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ముగ్గురు టికెట్ కోసం తెరపైకి రావడంతో ఈనెల 27న టికెట్ ఖరారు చేస్తానన్న చంద్రబాబు ప్రస్తుతం పెండింగ్ లో పెట్టారట. దీనివెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తున్నట్టు సమాచారం.

గోవర్ధన్ రెడ్డి అకస్మాత్తుగా బరిలోకి దిగడం.. తిరుగుబాటు చేయడంపై ఎమ్మెల్యే పోలంరెడ్డి, టీడీపీ నేత పెళ్లకూరు అవాక్కయ్యారు. ఇప్పుడు వీరితోపాటు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి కూడా టికెట్ కోసం బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం ను కలిసి లాబీయింగ్ చేశారు.

ఇలా నలుగురు ఒకేసారి కోవూరు టికెట్ కోసం పోటీపడడంతో జిల్లాలో అలజడి రేగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం దీనిపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని యోచిస్తున్నాట.. ఇలా కోవూరు వ్యవహారం తెలుగుదేశంలో ఎడతెగని పంచాయతీకి కారణమైంది.