Begin typing your search above and press return to search.
అధికార పార్టీలో పంచాయితీ గ్రూపుల గోల?
By: Tupaki Desk | 27 Jan 2021 3:30 PM GMTఅధికారంలో ఉన్న పార్టీలో నేతల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలాలు కావాలని చాలా మంది చేరుతుంటారు. తీరా సీట్ల పంపిణీ వచ్చేసరికి గ్రూపుల గోలతో చీలిపోయి పార్టీకే నష్టం తెస్తారు. ఇప్పుడు పంచాయితీ ఎన్నికల పోరులో ఇదే అధికార వైసీపీలో గుబులు రేపుతోంది. పార్టీలో ద్వితీయ శ్రేణి కేడర్ నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం, అసంతృప్తి చేటు చేయడం ఖాయమనే ఆందోళన వైసీపీని వెంటాడుతోంది.
పంచాయితీ ఎన్నికలు ఇప్పుడు అధికార వైసీపీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకున్నాయి. గ్రామాల్లో గెలిపించాల్సిన బాధ్యత వారిపై పడింది. రాష్ట్రంలో వైసీపీ గెలవగానే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే పేరుతో ఎడాపెడా చేరికలను వైసీపీ నేతలు ప్రోత్సహించారు. ఉన్న పాత వైసీపీ నేతలకు తోడు కొత్త కేడర్ కూడా రావడంతో ఇప్పుడు వైసీపీలో రెండు వర్గాలుగా కొనసాగుతున్నాయి. వీరికి పొసగకపోవడంతో గొడవలు మొదలయ్యాయి.
ప్రభుత్వ పథకాలు, పనులు, కాంట్రాక్టుల్లో కీలక నేతలంతా ఇంతకాలం లాభం చూసుకున్నారన్న ఆరోపణలున్నాయి.. దిగువ స్థాయి నేతలను పట్టించుకోలేద ఆవేదన వారిలో ఉంది.. ఆగ్రహంతో ఉన్న వారంతా ఇప్పుడు పంచాయితీ ఎన్నికల వేళ వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నారు.
పంచాయితీ ఎన్నికలకు వైసీపీ సర్కార్ సిద్ధంగా లేదు.అయినా నిమ్మగడ్డ పంతంతో వచ్చిపడ్డాయి. ఇప్పటికే ఓవర్ లోడ్ గా ఉన్న వైసీపీలో జిల్లా పార్టీల్లో గ్రూపులు, అసమ్మతి, నేతల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఈ సమయంలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం కొంత ఇబ్బందిగా మారింది. వీటిని గ్రామస్థాయిలో ఎదుర్కోవడంలో క్షేత్రస్థాయి నేతలే కీలకం కావడంతో ఎమ్మెల్యేలు ఇప్పుడు పిలిపించుకొని బతిమిలాడుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. వారందరినీ సీట్లలో సర్దుబాటు చేయడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందట..ఇది ప్రతిపక్ష టీడీపీకి వరంగా మారుతుందేమోనన్న ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది.
ఆది నుంచి వైసీపీలో ఉన్న నేతలు తమకే టికెట్లు కావాలని మొండి పట్టుదలతో ఉన్నారు. ఇక ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చిన వారు కూడా సీట్ల కోసం లాబీయింగ్ మొదలు పెట్టారు. ఎవ్వరినీ వద్దనే పరిస్థితి లేకపోవడంతో అధికార పార్టీలో గ్రూపుల గోల ఆ పార్టీకే ముప్పు తెచ్చేలా కనిపిస్తోందట.. నేతలు పోటీ చేయవద్దని కోరుతున్నా వినే పరిస్థితి లేదట.. ఈ నేపథ్యంలోనే పంచాయితీ ఎన్నికల వేళ అసంతృప్తులు, అసమ్మతులు తమ ప్రతాపం చూపిస్తున్నారట..