Begin typing your search above and press return to search.

పార్టీల్లో పెరిగిపోతున్న ‘గ్రేటర్’ ఉత్కంఠ

By:  Tupaki Desk   |   27 Dec 2020 12:30 PM GMT
పార్టీల్లో పెరిగిపోతున్న ‘గ్రేటర్’ ఉత్కంఠ
X
గ్రేటర్ పాలకవర్గం కాలపరిమితి దగ్గరపడుతున్నకొద్దీ అన్నీ పార్టీల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి ముగుస్తుంది. ఇదే సమయంలో మొన్ననే జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి మేయర్ కుర్చీలో కూర్చునేందుకు స్పష్టమైన మెజారిటి రాలేదు. దాంతో అన్నీ పార్టీల్లోను ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. ఏ రెండుపార్టీలు కూడా ఒకదానికితో మరొకటి కలిసే అవకాశం లేదు. దాంతో అందరిలోను కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది.

150 డివిజన్ల గ్రేటర్ మున్సిపాలిటిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ కు 58 సీట్లొచ్చాయి. తర్వాత బీజేపీకి 46 సీట్లు, చివరకు ఎంఐఎంకు 44 డివిజన్లు వచ్చాయి. మిగిలిన 2 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. మేయర్ కర్చీలో కూర్చోవాలంటే ఏపార్టీకైనా సొంతంగా 75 డివిజన్లకు పైగా రావాలి. ఇక ఎక్స్ అఫీషియో సీట్లను కలుపుకుంటే మొత్తం 206 డివిజన్లున్నట్లు లెక్క.

అయితే ఈ లెక్కన ఏపార్టీకి అయినా 103 డివిజన్లకు పైగా రావాలి. ప్రస్తుత పరిస్ధితి చూస్తే ఏ పార్టీకి కూడా అంత సీన్ లేదు. నిజానికి ఎన్నికలకు ముందే టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసే అవకాశాలున్నాయన్నది టాక్. అయితే బీజేపీ పుణ్యమా అని రెండుపార్టీలు కలిసే పరిస్ధితి లేకుండా పోయింది. టీఆర్ఎస్+ఎంఐఎం పార్టీలు ఒకటే అని టీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు ఎంఐఎంకు వేసినట్లే అని బీజేపీ ఓల్డ్ సిటిలో బాగా ప్రచారం చేసింది. దాంతో పాటు ఓల్డ్ సిటి మీద కెన్నేసిన బీజేపీ అక్కడ మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేసింది.

బీజేపీ ప్రచారం వల్ల రెండు పార్టీలు ఇపుడు కలిసే అవకాశాలు తగ్గిపోయాయి. తమ రెండుపార్టీల మధ్య ఎటువంటి పొత్తులేదని రెండుపార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పుకోవాల్సొచ్చింది. ఇందులో భాగంగానే ఓల్డ్ సిటిలో కూడా అన్నీ డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేసింది. సరే ప్రస్తుత విషయానికి వస్తే ఫిబ్రవరిలో ప్రస్తుత పాలకవర్గానికి కాలపరిమితి అయిపోయిన తర్వాత ఏమి జరగబోతోంది ?

ఏమి జరగబోతోంది అన్నదే సస్పెన్సుగా మారిపోయింది. ఏ రెండుపార్టీలైనా కలవకపోతే రెండే ఆప్షన్లున్నాయని ప్రచారం మొదలైంది. మొదటిదేమో స్పెషల్ ఆఫీసర్ల పాలన. ఇక రెండోదేమో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటం. అయితే రెండో ఆప్షన్ కన్నా టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిస్తేనే బాగుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది.మరి కేసీయార్ మనసులో ఏముందో ఇప్పటికైతే ఎవరికీ తెలీదు. చూద్దాం చివరినిముషంలో ఏమి చేస్తారో .