Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న ‘హైబ్రీడ్ ఉగ్రవాదం’

By:  Tupaki Desk   |   6 July 2021 6:42 AM GMT
పెరిగిపోతున్న ‘హైబ్రీడ్ ఉగ్రవాదం’
X
ఉన్నదంతా ఎలా వేగాలో తెలీక నానాఅవస్తలు పడుతుంటే కొత్తగా హైబ్రీడ్ ఉగ్రవాదం మొదలైందట. ఇలాంటి తరహా ఉగ్రవాదం ప్రధానంగా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోనే ప్రస్తుతాని పరిమితమైంది. అంటే బహుశా ప్రయోగాత్మక దశలో ఉందేమో. ఇక్కడ సక్సెస్ అయితే తర్వాత దేశమంతటా విస్తరిస్తారేమో ఉగ్రనేతలు. ఏమిటో ఫ్యాక్టరీలు, కంపెనీలను విస్తరించినట్లే ఉగ్రవాదంలో రకాలను, కొత్త పద్దతులను కూడా ఉగ్రవాద నేతలు దేశంలోని అన్నీ ప్రాంతాలకు మెల్లిగా విస్తరిస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే కొత్తగా బయటపడిన హైబ్రీడ్ ఉగ్రవాదంలో యాక్టివ్ గా ఉంటున్నవారిలో ఇప్పటివరకు ఎవరు కూడా పోలీసు రికార్డుల్లోకి ఎక్కినవారు కాదట. ఈ తరహా ఉగ్రవాదంలో యాక్టివ్ గా ఉన్నవారంతా సింగిల్ టార్గెట్ ను మాత్రమే ఎటాక్ చేస్తున్నట్లు బయటపడింది. అంటే ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే హైబ్రీడ్ ఉగ్రవాదంలో యాక్టివ్ గా ఉన్న వారికి వాళ్ళ బాసుల నుండి ఆదేశాలు వస్తాయి. వెంటనే ఓ పిస్టల్ తీసుకెళ్ళి టార్గెట్ ను దగ్గరనుండి కాల్చి చంపేయటమన్నమాట.

టార్గెట్ ను కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. ఓ పోలీసు అధికారి, మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్, ఓ డాక్టర్, హక్కుల కార్యకర్త ఇలాగ ప్రముఖులుగా ఉంటు ఒంటరిగా దొరికిన వాళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తారన్నమాట. ఎలాగూ ఒంటరిగానే ఉంటారు కాబట్టి వీళ్ళు కాల్చింది, వాళ్ళు చచ్చింది కూడా మూడోకంటికి తెలీదు. జమ్మూలో వరుసగా కొందరు ప్రముఖలు చనిపోవటంతో పోలీసులతో పాటు మిలిట్రీ అధికారులకు కూడా అనుమానాలు వచ్చాయి. విషయాలను బాగా లోతుగా విచారణ జరిపితే ఓ పథకం ప్రకారమే సింగిల్ టార్గెట్ల హత్యలు జరుగుతున్నట్లు బయటపడ్డాయి.

ఇలాంటి యాక్టివ్ లతో సమస్య ఏమిటంటే వీళ్ళని పట్టుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళగురించి ఇటు పోలీసు రికార్డుల్లో కానీ అటు మిలిట్రీ రికార్డుల్లో కానీ ఎక్కడా ఉండదు. ఎందుకంటే వీళ్ళవెరు మామూలు నేరాలు చేసేవారు కాదు కాబట్టే. జనావాసాల్లోనే అందరి మధ్యే తిరుగుతూ అందరితోను కలిసే ఉంటారు.

కాబట్టి ఇలాంటి వాళ్ళపై ఎవరికీ అనుమానాలు కూడా ఉండదు. బాసుల నుండి ఆదేశాలు వచ్చినపుడు మాత్రమే వీళ్ళు టార్గెట్ల దగ్గరకు వెళతారు. మిగిలిన సమయమంతా ఉద్యోగాలు చేసుకుంటునో లేకపోతే వ్యాపారాల్లో బిజీగానే ఉంటారు. 24 గంటలూ తమతోనే కలిసి తమతోనే ఉంటారు కాబట్టే ఇలాంటి టార్గెట్లపైకి మామూలు జనాల్లో ఎవరికీ అనుమానముండదు. ఇలాంటి హైబ్రీడ్ ఉగ్రవాదం పెరిగిపోతే మాత్రం దేశానికి పెద్ద ప్రమాధమని చెప్పక్క తప్పదు.