Begin typing your search above and press return to search.
‘వాయిదా’ల విషయంలో పెరిగిపోతున్న ఉత్కంఠ
By: Tupaki Desk | 13 Feb 2021 8:30 AM GMTపోయిన సంవత్సరం మార్చిలో వాయిదాపడిన జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. పోయిన మార్చిలో జరుగుతున్న జడ్పీ, ఎంపిటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ ఏకగ్రీవంగా వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే. వాయిదా పడేనాటికి సుమారు 25 శాతం స్ధానాలను వైసీపీ గెలుచుకుంది. దీనిపై ప్రతిపక్షాలు ప్రధానంగా తెలుగుదేశంపార్టీ పెద్ద రాద్దాంతం చేసింది.
అయితే ఒకవైపు గొడవలు ఇలాగుండగానే కరోనా వైరస్ కారణంగా ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ వాయిదా వేశారు. దాంతో అప్పట్లో ఆ గొడవ ముగిసింది. అయితే పంచాయితి ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలవ్వటంతో అప్పట్లో వాయిదాపడిన జడ్పీ, ఎంపిటీసీ ఎన్నికల విషయాన్ని ఏమి చేస్తారనేది సస్పెన్సుగా మారింది. ప్రతిపక్షాలన్నీ అప్పట్లో గెలిచిన స్ధానాలను కూడా రద్దు చేసి మళ్ళీ అన్నింటికీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయమై చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ కమీషనర్ తో శుక్రవారం భేటీ అయ్యారు. అప్పడు వాయిదాపడిన ఎన్నికలు+మిగిలిన స్దానాల్లో జరగాల్సిన ఎన్నికలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయమై నిమ్మగడ్డ ఎటువంటి నిర్ణయం చెప్పలేదని సమాచారం. మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి సమస్యలు ఎక్కడా తలెత్తాయా ? ఒకవేళ తలెత్తితే ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల కమీషనర్లు ఏమి చేశారు అనే విషయాలను తెలుసుకోవాలని నిమ్మగడ్డ అనుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఇక్కడ ఓ సమస్యుంది. అదేమిటంటే అప్పట్లో జరిగిన జడ్పీ, ఎంపీటీసీ గెలుపును స్వయంగా ఎన్నికల కమీషనరే ప్రకటించారు. గెలిచిన వాళ్ళకు రిటర్నింగ్ అధికారులు ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చేశారు. అంటే ఒకసారి అధికారికంగా ఎన్నికల కమీషన్ ధృవీకరించిన గెలుపును ఇపుడు తానే ఎలా రద్దు చేస్తుంది ? అన్నదే ప్రధాన సందేహం. ఒకవేళ అప్పటి గెలుపును కమీషన్ రద్దు చేస్తే గెలిచిన వాళ్ళు కోర్టుకెక్కే అవకాశం ఉంది. కాబట్టి నిమ్మగడ్డ ఏమి చేస్తారనే విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది.