Begin typing your search above and press return to search.
అన్నదాత కోసం తలవంచిన మోడీజీ..శభాష్
By: Tupaki Desk | 1 July 2017 6:55 AM GMTకర్షకుడు ఎండ అనక - వాన అనక కష్టించి పనిచేయనిదే మన కడుపులోకి ముద్ద దిగదు అనేది అందరికీ తెలిసిన విషయమే. బడాబాబులు తినే లావిష్ బఫెట్ నుంచి బక్క జీవులు తినే రేషన్ బియ్యం వరకు అన్నదాతల శ్రమ ఫలితమే. అలాంటి అన్నదాతలపై జీఎస్టీ రూపంలో పిడుగు పడుతుందని అనేక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పంట పండించడంలో కీలకమైన ఎరువులపై భారం మోపనుందని పలు వర్గాలు కలవరపడ్డాయి. అయితే దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. జీఎస్టీ మరికొద్ది గంటల్లో అమల్లోకి రానున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం జీఎస్టీ కౌన్సిల్ చివరి సారిగా 18వసారి భేటీ అయి, రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో కీలకమైనది ఎరువుల ధరలకు శ్లాబ్ తగ్గించడం. తాజా సమావేశం ప్రకారం 12 నుంచి 5 శాతం శ్లాబ్ లోకి మార్చింది. అలాగే ట్రాక్టర్ విడిభాగాల ధరలనూ తగ్గించే చర్య తీసుకుంది. 28 శాతం నుంచి 18 శాతం శ్లాబ్ కు మార్చడం ద్వారా రైతులకు లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నట్టయింది.
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. తద్వారా జీఎస్టీ ద్వారా ప్రజలపై అదనపు భారం పడుతుందని భావించిన పక్షంలో నిర్ణయాల పునర్ సమీక్షకు అభ్యంతరం లేదన్న సంకేతాన్ని కేంద్రం ఇచ్చినట్టయింది. ఈ విషయంలో కౌన్సిల్‌లోని సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ కర్షకులకు మేలు చేసే ఈ నిర్ణయం తుది దశలో అయినా తీసుకోవడం సంతోషకరమని పలువురు చెప్తున్నారు.
ఇదిలాఉండగా...కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మీడియాతో మాట్లాడుతూ తూచా తప్పకుండా పన్నులు చెల్లించే గౌరవప్రదమైన పన్ను చెల్లింపుదారులకు ఉపయుక్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఎనభై శాతం వస్తువుల్ని 18 శాతం శ్లాబులోనే ఉంచినట్టు వెల్లడించారు. ఉప్పు, సబ్బులు లాంటి రోజూ వాడే వస్తువుల ధరల్ని, అలాగే నిత్యావసరాల ధరల్ని జీఎస్టీలో ఏమీ మార్చలేదని కూడా ఆయన వెల్లడించారు. ఈ వస్తువుల్లో కొన్నింటిని జీఎస్టీ పరిధి నుంచి తొలగించామని, మరికొన్నింటి ధరల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల నిత్యావసరాలపై జీఎస్టీ ప్రభావం ఎంతమాత్రం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. మొత్తం మీద చూస్తే నిత్యావసరాలు, అత్యవసర వస్తువులు అన్నీ కలిపి 80 శాతం దాకా ఉంటాయన్నారు. వాటిల్లో కూరలు - పాలు - గుడ్లు - పిండి వంటి ఆహార సంబంధ వస్తువులు - ఆరోగ్యం - విద్య సర్వీసుల కు సంబంధించిన వాటిని దీన్నించి మినహాయించినట్లు ఆయన తెలిపారు. టీ - వంటనూనెలు - టెక్స్ టైల్స్ - పంచదార - చిన్నపిల్లలకు వాడే వస్తువులు అయిదు శాతం పరిధిలోనే ఉన్నాయన్నారు. ఇక లగ్జరీ వస్తువులు 19 శాతం పరిధిలో ఉంటాయన్నారు. మోటార్ సైకిళ్లు - పర్ ఫ్యూములు, షాంపూలు 18 శాతం శ్లాబులోను, లేదా అంతకు మించిన శ్లాబులోను ఉంటాయన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/