Begin typing your search above and press return to search.
జీఎస్టీ సందేహాల్ని తీర్చే యాప్ వచ్చేసింది
By: Tupaki Desk | 9 July 2017 8:40 AM GMTతెలిసింది తక్కువైనా.. చాలా ఎక్కువ తెలిసినట్లుగా ఫీలవుతున్న అంశం ఏదైనా ఉందంటే అది జీఎస్టీనే. ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ ట్యాగ్ లైన్ పెట్టి మరీ ప్రచారం చేసిన జీఎస్టీ పన్ను విధానంతో లాభం ఎంత? నష్టం ఎంత? అన్న సందేహాన్ని సూటిగా చెప్పే వారెవరూ కనిపించరు. కానీ.. వెల్ కం జీఎస్టీ అని పోస్టులు పెట్టేవాళ్లు.. హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెప్పే వారు మాత్రం చాలామందే కనిపిస్తారు.
జీఎస్టీ వచ్చి వారం పూర్తి అయినా.. బడా కంపెనీలు చాలా వరకూ ఈ అంశంపై అవగాహనకు రాలేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. జీఎస్టీ మీద ఉండే సందేహాల్ని తీర్చేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం తాజాగా జీఎస్టీ యాప్‌ను తీసుకొచ్చింది.
జీఎస్టీ రేట్ ఫైండర్ పేరుతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఈ మొబైల్‌యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ సాయంతో ఏ వస్తువు మీద ఎంత పన్ను.. ఏ పరిధిలో ఎంత విధిస్తారన్న సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్ తో ఏ వస్తువుకు ఎంత పన్ను బాదుడు ఉందో తెలుసుకునే వీలుంది. ఆ యాప్ ఆన్ లైన్లో మాత్రమే కాదు.. ఆఫ్ లైన్లోనూ పని చేస్తుంది.