Begin typing your search above and press return to search.

జీఎస్టీ బాదుడు నుంచి త‌ప్పించిన తాజా లిస్ట్ ఇదే!

By:  Tupaki Desk   |   23 Dec 2018 5:08 AM GMT
జీఎస్టీ బాదుడు నుంచి త‌ప్పించిన తాజా లిస్ట్ ఇదే!
X
మోడీని గొప్ప‌గా కీర్తించే వారికి ఏ మాత్రం లోటు లేదు. కోట్లాది మంది ఆయ‌న ఘ‌న‌త‌ను కీర్తిస్తూ మురిసిపోతుంటారు. మోడీ లాంటి వాడిని పొగిడే అవ‌కాశం త‌మ‌కు ద‌క్క‌టంతో త‌మ జ‌న్మ త‌రించిన‌ట్లేన‌ని ఫీల‌య్యే వారికి కొర‌త లేదు. మోడీ చేసిన త‌ప్పుల్ని అస్స‌లు ప‌ట్టించుకోకుండా.. ఆయ‌న ఆకాశాన్ని ఎత్తేయ‌టం కోస‌మే తాము బ‌తికి ఉన్న‌ట్లుగా వారూ లేక‌పోలేదు. మోడీలోని మంచి కోణాన్ని చెప్పేందుకు గంట‌ల కొద్ది స‌మ‌యాన్ని ఖ‌ర్చు చేసే చాలామందికి క‌నిపించ‌ని కోణం ఏమంటే.. మోడీ మాష్టారి హ‌యాంలో ప‌న్ను పోటు ఎంత‌లా ఉంద‌న్న‌ది జీఎస్టీ లిస్ట్ చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇల్లు క‌ట్టుకోవ‌టం కేవ‌లం సంప‌న్నులు మాత్ర‌మే కాదు.. సామాన్యుల నుంచి జీతం మీద బ‌తుకులు తెల్లార్చే మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి జీవిత‌కాల కోరిక‌. అలాంటి వారి వెన్ను విరిగిపోయేలా సిమెంటుపై జీఎస్టీని 28 శాతం విధిస్తున్నా ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్థితి. ఇంటి నిర్మాణానికి కీల‌క‌మైన సిమెంట్ పైన అంత భారీ ప‌న్ను ఏమిటి? అని ప్ర‌శ్నించిన వారే క‌నిపించ‌రు.

సిమెంట్ లాంటి ముడి ప‌దార్థంపై అంత పన్ను వేయ‌టం చూస్తేనే.. మోడీ మాష్టారి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.పేద..సామాన్య‌ ప్ర‌జ‌ల గురించి మాత్ర‌మే చెబుతున్నారు. .సిమెంట్‌ను పెద్ద ఎత్తున వినియోగించే బ‌డాబాబులు.. ప‌రిశ్ర‌మ‌ల సంగ‌తేమిట‌ని అడ‌గొచ్చు. సిమెంట్ లాంటి వ‌స్తువుల మీద ప‌న్ను ఎంత త‌క్కువ‌గా ఉంటే అంత మంచిది. నిర్మాణ వ్య‌యం త‌గ్గ‌టంతో పాటు.. అంతిమంగా ఆ ప్ర‌యోజ‌నం ప్ర‌జ‌లకు ల‌భించ‌టం ఖాయం. అయితే.. ఇలాంటి వాటి గురించి ఆలోచించి.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యాల్ని తీసుకోవ‌టంలో మోడీ మాష్టారు కాస్త ఆల‌స్యంగా నిర్ణ‌యాలు తీసుకుంటారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. ప‌న్ను పోటును త‌గ్గించ‌టం.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గిస్తుండ‌టం లాంటి చ‌ర్య‌లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. ఇప్పుడే ఎందుకంటే.. ఓట‌ర్ దేవుళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌లిగా. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటే దాని ఎఫెక్ట్ పెద్ద‌గా ఉండ‌దు. అదే.. ముందు నుంచి అంటే ప్ర‌జ‌ల్ని న‌మ్మించే వీలు ఉంటుంది.

తాజాగా.. జీఎస్టీ ప‌రిధిలో ఉండే ప‌లు వ‌స్తువుల‌కు సంబంధించిన వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. వివిధ వ‌స్తువుల‌కు సంబంధించిన ప‌న్ను రేట్లు మార‌నున్నాయి. ఆ జాబితాను చూస్తే.. జీఎస్టీలో గ‌రిష్ఠంగా 28 శాతం ప‌న్ను విధించే వాటి జాబితా అంత‌కంత‌కూ చిక్కిపోతోంది. తాజాగా మార్చిన ప‌లు అంశాల‌తో.. ఇప్పుడా జాబితాలో కేవ‌లం 28 వ‌స్తు సేవ‌లే మిగిలాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ 28 శాతం ప‌న్ను వ‌సూలు చేస్తూ.. వాటిని 18 శాతంగా కుదించిన వ‌స్తు సేవ‌ల జాబితాను చూస్తే..

+ కప్పీలు(గిలక)
+ ట్రాన్స్‌మిషన్‌ షాఫ్ట్‌(వాహనాల్లో క్లచ్, ఇంజిన్‌ను అనుసంధానించేది
+ పునర్వినియోగ టైర్లు
+ లిథియం అయాన్‌ పవర్‌ బ్యాంకులు
+ డిజిటల్‌ కెమెరాలు
+ వీడియో కెమెరా రికార్డర్‌లు
+ వీడియో గేమ్‌ పరికరాలు
+ 32 అంగుళాల వరకున్న టీవీ తెరలు
+ కంప్యూటర్
+ రూ.100కు పైనున్న సినిమా టికెట్లు

12 శాతం ప‌న్నుకు కుదించిన వ‌స్తు సేవ‌లు
+ రూ.100 లోపున్న సినిమా టికెట్లు
+ సహజ బెరడుతో తయారైన వస్తువులు తదితరాలు

5 శాతం శ్లాబులోకి కొత్త‌గా వ‌చ్చిన వ‌స్తు సేవ‌లు..

+ ఊత కర్ర
+ ఫ్లైయాష్‌ ఇటుకలు
+ సహజ బెరడు
+ చలువరాళ్లు
+ ఇతర దేశాల సహకారంతో ప్రభుత్వం సమకూర్చే నాన్‌–షెడ్యూల్డ్.. చార్టర్డ్‌ విమానాల సేవ‌లు
+ పునర్వినియోగ ఇంధన ఉపకరణాలు
+ పున‌ర్వినియోగ ఇంధ‌న ఉప‌క‌ర‌ణాల త‌యారీ
+ శీతలీకరించిన - ప్యాక్‌ చేసిన కూరగాయలు
+ రసాయనాలతో భద్రపరచిన.. తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలు

ప‌న్ను పోటు నుంచి త‌ప్పించిన వ‌స్తు సేవ‌లు

+ జన్‌ ధన్‌ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవ‌లు
+ మ్యూజిక్‌ బుక్స్‌
+ ప్యాకింగ్‌ చేసిన కూరగాయలు