Begin typing your search above and press return to search.
జీఎస్టీ హెడ్డాఫీసులో పరిస్థితేంది?
By: Tupaki Desk | 30 Jun 2017 9:43 AM GMTదేశ పన్నుల విధానాన్ని సంపూర్ణంగా మార్చేయనున్న జీఎస్టీ మరికొద్ది గంటల్లో అమల్లోకి రానుంది. ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు జైగంట మోగించటం ద్వారా.. ఈ కొత్త పన్నుల విధానం దేశంలోకి అమలు కానుంది. ఇందుకు సంబంధించి పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా భారీ వేడుకను ఏర్పాటు చేయటానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.
ఇక.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ జీఎస్టీ మీద భారీగా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు సామాన్యులు.. వ్యాపారులు.. ఇలా ప్రతి ఒక్కరూ జీఎస్టీ తమ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న చర్చల్లో బిజీబిజీగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా జీఎస్టీ మీద ఇంత జోరు జోరుగా చర్చలు జరుగుతున్న వేళ.. ఈ కొత్త పన్నుల విధానానికి మూలస్తంభమైన జీఎస్టీ ప్రధాన కార్యాలయంలో పరిస్థతి మరోలా ఉంది.
ఈ అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి రానున్న జీఎస్టీకి సంబంధించి తుది ఏర్పాట్లలో నిమగ్నమైంది జీఎస్టీ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులు. ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేనట్లుగా.. అక్కడి ఉద్యోగులు తమదైన లోకంలో ఉండిపోయినట్లుగా తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు పక్కనే ఉన్న వరల్డ్ మార్క్ 1 భవనంలో ఉన్న జీఎస్టీ ప్రధాన కార్యాలయంలో గంభీర వాతావరణం నెలకొని ఉండటమే కాదు.. నిశ్శబ్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఎందుకిలా అంటే.. జీఎస్టీకి సంబంధించి నెట్ వర్క్ సరిగా ఉందా? లేదా? అన్నది చెక్ చసుకోవటంతో పాటు.. జీఎస్టీకి సంబంధించిన ఫ్లాట్ ఫాం పూర్తి స్థాయిలో ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జీఎస్టీ కింద 6.6 మిలియన్లు చేరగా.. మరో 1.7 లక్షల దరఖాస్తులు జీఎస్టీ కింద చేరనున్నట్లుగా చెబుతున్నారు. వీరందరిని వీలైనంత వేగంగా జీఎస్టీలోకి మార్చేందుకు అక్కడి సిబ్బంది విరామం ఎరుగకుండా పని చేస్తున్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం వ్యాపార సంస్థలు అప్లై చేసుకోవటానికి 30 నిమిషాల కంటే తక్కువ టైం తీసుకుంటుందని చెబుతున్నారు. గడిచిన కొన్ని వారాలుగా సెలవులు తీసుకోకుండా పని చేస్తున్న జీఎస్టీ ప్రధాన కార్యాలయ సిబ్బందికి.. పని ఒత్తిడి మరో నెల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు. మరింతగా శ్రమిస్తున్న వారి శ్రమ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/