Begin typing your search above and press return to search.
మోడీ రాజ్యంలో బాత్రూం వాడితే అన్నేసి డబ్బులు కట్టాల్సిందేనట
By: Tupaki Desk | 4 Sep 2022 4:56 AM GMTమోడీ రాజ్యమా? మజాకానా? అన్న మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. మోడీ ప్రధానమంత్రి కావాలే కానీ దేశ రూపురేఖలు మారిపోతాయంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోని బీజేపీ అండ్ కో వీరుల అంచనాలు మామూలుగా ఉండేవి కావు. మోడీ పవర్లోకి వచ్చినంతనే లీటరు పెట్రోల్ రూ.50కు.. డీజిల్ మరింత చౌకగా వస్తుందన్న మాట మొదలు.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని.. జీవన ప్రమాణాలు పెరుగుతాయన్న మాటలు బోలెడన్ని వినిపించేవి. ఇక.. బీజేపీ అయితే.. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే పేదల ఖాతాల్లోకి విదేశాల నుంచి తెచ్చే నల్లధనాన్ని బట్వాడా చేస్తామన్న హామీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
వీటన్నింటిని పక్కన పెడితే.. మోడీ హయాంలో రైల్వేస్టేషన్ లో బాత్రూం వినియోగించుకుంటే కూడా జీఎస్టీ కట్టాల్సిన గొప్ప రోజులు వచ్చేశాయి. విన్నంతనే ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. సుబ్బరంగా జీఎస్టీని వేస్తున్న వైనం షురూ అయి చాలాకాలమే అయినా.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. మోడీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిన అంశాలు రెండే రెండు. అందులో ఒకటి పెట్రోల్.. డీజిల్ ధరలు అయితే.. మరొకటి జీఎస్టీ. ఈ రెండింటి విషయంలో ఆయన ప్రభుత్వం అనుసరించిన వైఖరికి ఇప్పడు కాకున్నా భవిష్యత్తులో మాత్రం మూల్యం చెల్లించక తప్పదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
తాజాగా వెలుగు చూసిన ఉదంతం గురించి వింటే షాక్ తినాల్సిందే. మరీ.. ఇంతలా జీఎస్టీని వాడేస్తున్నారా? అన్న భావన కలుగక మానదు. దేశ రాజధానికి కూతవేటు దూరంలో ఉండే ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన వాష్ రూమ్ ను వాడుకొని బయటకు వచ్చిన వారికి.. చెల్లించాల్సిన బిల్లును చేతిలో పెట్టటం ఒక ఎత్తు అయితే.. అందులో అమౌంట్ ఒకలాంటి షాకిస్తే.. ఆ మొత్తానికి జీఎస్టీ కింద వసూలు చేసే అమౌంట్ కు ఒళ్లు మండిపోయేలా ఉంది. దీనిపై స్థానిక గైడ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వాదనను బయటకు వినిపించటంతో ఇదో ఇష్యూలా మారింది.
తాజాగా బ్రిటిష్ ఎంబసీ నుంచి విదేశీయులు ఇద్దరు గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ దిగారు. వారిని శ్రీవాస్తవ అనే గైడ్ రిసీవ్ చేసుకున్నారు. రైలు దిగిన వారు.. కాస్తంత ప్రెషప్ (లఘు శంక తీర్చుకోవటానికి) కావాలన్నారు. దీంతో వారిని స్టేషన్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లాంజ్ లోకి తీసుకెళ్లారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో బయటకు వచ్చారు.
సాధారణంగా మనకు తెలిసి వాష్ రూం వాడితే రూ.5 లేదంటే రూ.10 కాదంటే రూ.20. కానీ.. అక్కడి రిసెప్షనిస్టు మాత్రం అతడి చేతిలో రూ.224 బిల్లు చేతిలో పెట్టటంతో అవాక్కు అయ్యాడు. వాష్ రూంను ఐదు నిమిషాల చొప్పున ఇద్దరు వాడుకున్నందుకు ఒక్కొక్కరికి రూ.100 దానికి జీఎస్టీగా 12 చొప్పున మొత్తం రూ.224 చెల్లించాలని బిల్లు చేతిలో పెట్టటంతో అతగాడికి ఒళ్లు మండింది. అంత మొత్తం ఎలా చెల్లిస్తామంటూ అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు. చివరకు అక్కడి సిబ్బంది ఒత్తిడితో ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది.
దీనిపై శ్రీవాస్తవ తన ఆవేదనను వినిపించాడు. అతడికి దన్నుగా పలువురు ఐఆర్ సీటీసీ తీరును.. మోడీ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మండిపడ్డారు. ఇలాంటి వేళ.. ఈ తరహా విమర్శలకు చెక్ చెప్పేందుకు ఐఆర్ సీటీసీ ప్రతినిధి వివరణ ఇస్తూ.. ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్రవేశానికి ప్రత్యేక ఛార్జ్ ఉంటుందని.. దానిపై జీఎస్టీ పడుతుందని చెప్పుకొచ్చారు. లాంజ్ లో ఉండే టూరిస్టులకు.. ఫారినర్లకు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చని.. కాంప్లిమెంటరీగా కాఫీ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ మాటలు ఎలా ఉన్నా.. అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చే లఘు శంకకు రూ.100 బాదేయటం.. దానికి రూ.12 జీఎస్టీ వసూలు చేయటం మాత్రం దారుణమని చెప్పక తప్పదు. అయినా.. శ్మశానాల్లోని సేవలకు సైతం జీఎస్టీ వసూలు చేసే మోడీ సర్కారు.. బాత్రూం వాడే విషయంలోనూ జీఎస్టీ బాదేయటంలో పెద్ద విషయం ఏముందంటూ పలువురు మండిపడుతున్నారు.