Begin typing your search above and press return to search.

బాదేసే జీఎస్టీతో లాభం లెక్క బ‌య‌ట‌కొచ్చింది

By:  Tupaki Desk   |   12 July 2017 4:42 AM GMT
బాదేసే జీఎస్టీతో లాభం లెక్క బ‌య‌ట‌కొచ్చింది
X
ప‌న్ను బాదుడిని పండ‌గ‌లా సెల‌బ్రేట్ చేసిన ఘ‌న‌త మ‌న‌కు మాత్ర‌మే ద‌క్కింద‌ని చెప్పాలి. ప‌న్ను బాదుడుకు స‌రికొత్త విధానానికి తెర తీస్తే.. అందుకు ప్ర‌తిగా హ్యాపీ బ‌ర్త్ డే జీఎస్టీ అంటూ వాట్సాప్ ల‌లో మెసేజ్ ల మీద మెసేజ్ లు పెట్టుకోవ‌టం.. కేక్ క‌టింగ్ ప్రోగ్రామ్‌ ల‌ను సోష‌ల్ మీడియాలో చేసుకోవ‌టం లాంటివెన్నోసిత్రాలు జీఎస్టీ ఎంట్రీ వేళ‌లో చోటు చేసుకున్నాయి.

జీఎస్టీతో లాభం మాట ఎలా ఉన్నా..బాదుడు ఏ స్థాయిలో ఉంటుంద‌న్న విష‌యం ఇప్పుడిప్పుడే జ‌నాల‌కు అర్థ‌మ‌వుతున్న ప‌రిస్థితి. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ టిఫిన్ సెంట‌ర్‌ కు వెళ్లి ప‌న్నుపోటు లేకుండా తిని వ‌చ్చిన వారికి.. ఇప్పుడు జీఎస్టీ పేరుతో ప‌డుతున్న భారం దెబ్బ‌కు.. దీనికి కూడా జీఎస్టీనా? అంటూ క్వ‌శ్చ‌న్ వేసేస్తున్నారు. అవును సార్‌.. అంటూ హోట‌లోడు స‌మాధాన‌మిస్తే.. మింగా లేక క‌క్కాలేక డ‌బ్బులు చెల్లించి బ‌య‌ట‌ప‌డుతున్నాడు.

ఇలాంటి బాదుడు య‌వ్వారం ఒక్క హోట‌ల్ కు మాత్ర‌మే కాదు.. చాలాచోట్ల జీఎస్టీ పేరుతో ప‌న్ను బాదుడు షురూ కావ‌టం.. గ‌తంలో ప‌న్ను లేని చోట కూడా ప‌న్ను ఉందంటూ బిల్లు చేతిలో పెడుతున్న వైనంతో వినియోగ‌దారుడు తెగ ఇబ్బంది ప‌డుతున్న ప‌రిస్థితి. బాదుడు ముచ్చ‌ట ఎలా ఉన్నా..జీఎస్టీకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చాక వ‌స్తువుల ప్ర‌యాణ స‌మ‌యం చాలావ‌ర‌కూ మెరుగు ప‌డింద‌ని చెబుతున్నారు. గ‌తంతో పోలిస్తే.. దేశ వ్యాప్తంగా వ‌స్తువుల ర‌వాణాలో చాలానే వేగం వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ప్రయాణ స‌మ‌యం త‌గ్గిపోవ‌టంతో వ‌స్తువుల డెలివ‌రీ విధానం మ‌రింత వేగ‌వంత‌మైంది. జీఎస్టీ ప‌న్ను విధానం వ‌స్తువుల స‌ర‌ఫ‌రాలో వేగాన్ని ఎలా పెంచిన‌ట్లు? అన్న ప్ర‌శ్న వేసుకుంటే ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తోంది. ఇప్ప‌డు వినిపిస్తున్న అంచ‌నాల ప్ర‌కారం.. గ‌తంతో పోలిస్తే జీఎస్టీ విధానం అమ‌ల్లోకి వ‌చ్చాక వ‌స్తువుల్ని డెలివ‌రీ చేసే స‌మ‌యంలో 20 శాతం ఆదా అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

జీఎస్టీతో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లోని చెక్ పోస్టుల‌ను తొల‌గించ‌టంతో ప్ర‌యాణ స‌మ‌యం దాదాపు 20 శాతానికి పైనే త‌గ్గిపోయిందని చెబుతున్నారు. ప‌న్నులు గుంజే అధికారులు రోడ్ల మీద క‌నిపించ‌ట్లేద‌ని చెబుతున్నారు. అయితే.. ర‌వాణా శాఖ మాత్రం ఏదో ఒక సాకుతో డ‌బ్బు గుంజుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌యాణ స‌మ‌యం ఆదా విష‌యానికి వ‌స్తే గ‌తంలో ఢిల్లీ - ముంబ‌యిల మ‌ధ్య ప్ర‌యాణం నాలుగు రోజులు ప‌ట్టేది కాస్తా.. జీఎస్టీ త‌ర్వాత మూడు రోజుల‌కు త‌గ్గిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేనా.. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాలంటే గ‌తంలో ఆరున్న‌ర రోజులు ప‌ట్టేద‌ని ఇప్పుడు ఐదు రోజుల‌కే వెళ్లిపోతున్న‌ట్లుగా చెబుతున్నారు. ప‌న్నులు విధించే అధికారులు ఎవ‌రినీ అదుపులోకి తీసుకురాకూడ‌ద‌న్న రూల్ తో ప్ర‌యాణ స‌మ‌యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. జీఎస్టీతో బాదుడే కాదు.. లాభాలు కూడా ఉన్నాయ‌న్న మాట‌.