Begin typing your search above and press return to search.
జీఎస్టీపై అప్పట్లో మోడీ అన్నేసి మాటలు అన్నారు
By: Tupaki Desk | 30 Jun 2017 5:58 PM GMTసమయానికి తగినట్లుగా మాట్లాడటం నేతలకు మామూలే. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలోకి వచ్చిన వెంటనే మరోలా మాట్లాడేయటం కామన్. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మినహాయింపు కాదన్న విషయాన్ని చెప్పే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.
కొద్ది గంటల్లో జీఎస్టీని గ్రాండ్ గా లాంఛ్ చేయనున్న మోడీ సర్కారు తీరును తప్పు పడుతూ విపక్ష కాంగ్రెస్.. ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించటం తెలిసిందే. చారిత్రక పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ అర్థరాత్రి జీఎస్టీని జై గంట కొట్టి మరీ గ్రాండ్ గా లాంఛ్ చేయాలని మోడీ సర్కారు నిర్ణయించింది.
ఇదిలాఉంటే.. జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక పాత వీడియోను తాజాగా విడుదల చేసింది. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రోజుల్లో జీఎస్టీని దుమ్మెత్తి పోస్తూ మోడీ మాట్లాడిన ప్రసంగమే సదరు వీడియోలో ఉండటం గమనార్హం. జీఎస్టీ ఎన్నటికి విజయవంతం కాదంటూ మోడీ మాట్లాడిన మాటలతో కూడిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.
ఇదిలా ఉంటే విదేశాలకు వెళ్లిన రాహుల్ సైతం.. తాజాగా జీఎస్టీ మీద గళం విప్పారు. సరైన ప్రణాళికలు.. దూరదృష్టి.. సంస్థాగత సంసిద్ధత లేకుండానే జీఎస్టీని అమలు చేయటాన్ని జీఎస్టీ తమాషా పేరుతో విమర్శిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/