Begin typing your search above and press return to search.
ప్రజల జేబులకు చిల్లు.. మోడీ గల్లాపెట్టె నిండు
By: Tupaki Desk | 2 Dec 2019 10:15 AM GMTమోడీ సంస్కరణలు ప్రజల జేబులకు చిల్లుపెట్టినా ఆయన గల్లాపెట్టా మాత్రం బాగానే నిండుతోంది. మోడీ ప్రభుత్వం గద్దెనెక్కాక దేశంలో పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జీఎస్టీ పేరుతో మోడీ డైరెక్టుగా పన్నులు వేసి వసూలు చేస్తున్నాడు.
తాజాగా జీఎస్టీ వసూళ్లు మళ్లీ లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. మూడు నెలల అనంతరం నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఏకంగా 6శాతం వృద్ధి చెంది రూ.1.3 లక్షల కోట్లకు చేరడం విశేషం. ఇది పండుగల సీజన్ కావడంతో భారీగా వసూళ్లు వచ్చిపడ్డాయి.
దేశం ఆర్థిక మందగమనంలో ఉన్నా.. ప్రతికూల ఫలితాలు వస్తున్నా మోడీ జీఎస్టీ మాత్రం 6శాతం వృద్ధిని సాధించడం విశేషం. గత జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.02 కోట్లు వచ్చాయి. మళ్లీ నవంబర్ నెలలోనే రూ.1.03 కోట్లు రావడం విశేషం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక నెలవారి వసూళ్లలో మోడీ సర్కారు రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 2017 నుంచి ఎనిమిది నెలలు ఇలా లక్ష కోట్ల మార్క్ దాటడం విశేషం.