Begin typing your search above and press return to search.
సెక్స్ వర్కర్లకు షాకిస్తున్న జీఎస్టీ
By: Tupaki Desk | 10 July 2017 6:05 AM GMTభారతదేశ అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అయిన జీఎస్టీ ఎఫెక్ట్ అన్ని వర్గాలపై పడుతున్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క రంగాన్ని మినహాయించకుండా మోగిపోతున్న ఈ భారం తాజాగా సెక్స్ వర్కర్లకు సైతం చుక్కలు చూపిస్తోంది. శానిటరీ నాప్కిన్స్‌పై 12 శాతం జీఎస్టీ విధించడంతో ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన కలకతాలోని సోనాగచిలో సెక్స్ వర్కర్లు షాక్ తింటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. పరిశుభ్రత క్యాంపెయిన్ లో భాగంగా సెక్స్‌వర్కర్లలో అవగాహన పెంచడంతో వారిలో నాప్ కిన్స్ వాడే వారి సంఖ్య గతంలో 20 శాతం నుంచి 85 శాతానికి పెరిగింది. అయితే తాజా మళ్లీ జీఎస్టీ భారం 12 శాతం చేయడంతో ఇప్పుడు వారంతా మళ్లీ వెనుకటి పరిస్థితికి మళ్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
జీఎస్టీ శ్లాబ్ లలో కండోమ్స్ పై జీరో ట్యాక్స్ నిర్ణయం బాగానే ఉన్నా నాప్‌కిన్స్‌పై 12 శాతం పన్ను విధించడం బాధాకరమని 1,30,000 మంది సెక్స్ వర్కర్లతో కూడిన దర్బార్ మహిళా సమన్వయ కమిటీ(డీఎంఎస్ సీ) ఆవేదన వ్యక్తం చేసింది. సెక్స్ వర్కర్లలో అవగాహన పెంచడంతో పాటు సబ్సిడీపై నాప్ కిన్స్ ను అందించడంతో వీటి వాడకం ఇటీవల గణనీయంగా పెరిగిందని డీఎంఎస్ సీ ప్రతినిధి సమర్జిత్ జన పేర్కొన్నారు. నాప్ కిన్స్‌పై 12 శాతం పన్ను విధించడంతో వీటి వాడకం తగ్గుముఖం పట్టి సెక్స్ వర్కర్ల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెరిగితే తాను నాప్ కిన్స్‌ను వాడబోనని 35 ఏళ్ల సెక్స్ వర్కర్ ఒకరు చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని ఆమె అన్నారు. న్యాప్ కిన్స్ వాడకం తమకు తప్పనిసరని..అయితే ధరలు పెరిగితే మాత్రం నాప్ కిన్స్‌కు ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి ఉంటుందని సెక్స్ వర్కర్లు తమతో వాపోయినట్లు దర్బార్ మహిళా సమన్వయ కమిటీ ప్రతినిధి మీడియాకు వివరించారు.