Begin typing your search above and press return to search.
తిరుమల వెంకన్నపైనా జీఎస్టీనా?: వైఎస్సార్సీపీ ఎంపీ ఫైర్
By: Tupaki Desk | 3 Aug 2022 9:37 AM GMTద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ధరల పెరుగుదలపై రాజ్యసభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చలో ఆయన మాట్లాడారు.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)పై ఉందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో అటు ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ రెండూ విఫలమయ్యాయని చెప్పారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం 6 శాతానికిపైనే ఉంటుందని ఆర్బీఐ ప్రకటించిందని లోక్ సభ దృష్టికి ఆయన తెచ్చారు. విదేశాలతో పోల్చుకుని మనం మెరుగ్గానే ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదన్నారు.
ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని విజయసాయిరెడ్డి చెప్పారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడిందన్నారు. ఇప్పటికైనా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడంపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బొగ్గు, నూనె ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరాయన్నారు.
తిరుమల వెంకన్నను కూడా వదలకుండా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ అంశాన్ని చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చానని గుర్తు చేశారు. బీజేపీ సభ్యులు చాలామంది తిరుమల దేవుణ్ని ప్రార్థిస్తారని, కానీ పన్ను వేయడం మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెస్, సర్ చార్జీల్లో ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన వాటా ఎందుకివ్వరని నిలదీశారు. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వడం లేదన్నారు. దీంతో గత ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.46 వేల కోట్లు నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం 10.4 శాతం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని చెప్పారు.
2000 సంవత్సరంలో రూ.లక్ష ఇప్పుడు రూ.27 వేలకు సమానమన్నారు. దేశంలో ప్రజలకు సామాజిక, ఆర్థికభద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నందున తగిన చర్యలు చేపట్టి ధరల పెరుగుదలను అదుపు చేయాలని కోరారు.