Begin typing your search above and press return to search.

జీఎస్టీ బాదుడుపై డౌటా..18005995399కు కాల్ చేయండి

By:  Tupaki Desk   |   28 Oct 2017 4:30 AM GMT
జీఎస్టీ బాదుడుపై డౌటా..18005995399కు కాల్ చేయండి
X
ఒక దేశం.. ఒక పన్ను పేరుతో దేశ ప్ర‌జ‌ల మీద వేస్తున్న జీఎస్టీ వ‌చ్చిన నాటి నుంచి మోడీ స‌ర్కారుపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. జీఎస్టీ కార‌ణంగా కొన్ని సేవ‌ల ధ‌ర‌లు పెరిగిన మాట వాస్త‌వమే అయినా.. జీఎస్టీ పేరుతో కొంద‌రు వ్యాపారులు చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదు. జీఎస్టీ పేరుతో భారీగా ప‌న్ను వ‌సూళ్లు చేస్తున్న వారిపై ఫిర్యాదులు చేయాలంటే ఎవ‌రికి చేయాలి? ఎలా చేయాల‌న్న సందేహం ఉంటుంది. దీనికి స‌మాధానం తాజాగా వ‌చ్చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప‌రిధిలోని జీఎస్టీ సందేహాల మీదా.. జీఎస్టీ పేరుతో ఎవ‌రైనా భారీగా బాదేస్తున్నా.. ఎమ్మార్పీ ధ‌ర‌కు జీఎస్టీ క‌లిపి వ‌సూళ్లు చేస్తున్నా వెంట‌నే ఫిర్యాదు చేయ‌టానికి వీలుగా ఒక టోల్ ఫ్రీ నెంబ‌రును ఏర్పాటు చేశారు. 18005995399 నెంబ‌రుకు ఫోన్ చేసి.. అడ్డ‌గోలుగా ఎవ‌రైనా జీఎస్టీ వ‌సూలు చేస్తుంటే ఫిర్యాదు చేయొచ్చు.

తెలంగాణ జోన్ సీజీఎస్టీ చీఫ్ క‌మిష‌న‌ర్ బాన్కి బెహారీ అగ్ర‌వాల్ ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశాల్ని ఆయ‌న చెప్పుకొచ్చారు. జీఎస్టీ వ‌సూలు చేసే వ్యాపారులు విధిగా జీఎస్టీ గుర్తింపు సంఖ్య‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తి బిల్లుపైనా స‌ద‌రు వ్యాపారి జీఎస్టీ నెంబ‌రును ముద్రించాల‌ని.. బిల్లులో ఏ వ‌స్తువుకు సీజీఎస్టీ ఎంత‌? ఎస్టీఎస్టీ ఎంత‌న్న విష‌యాన్ని క్లియ‌ర్ గా వెల్ల‌డించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. జీఎస్టీ పేరుతో ఎవ‌రైనా ఎక్కువ మొత్తంలో ప‌న్ను వ‌సూలు చేస్తుంటే వారిపై ఫిర్యాదు చేయొచ్చ‌ని.. అలాంటి ఫిర్యాదుల‌ను ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని చెప్పారు. అధిక‌ప‌న్ను విధింపు.. బిల్లులో ప‌న్ను వివ‌రాలు లేక‌పోవ‌టం లాంటి అంశాల‌పై కంప్లైంట్ చేయొచ్చ‌న్నారు. ఎమ్మార్పీ (గ‌రిష్ఠ చిల్ల‌ర ధ‌ర‌) కంటే ఎక్కువ ధ‌ర‌కు అమ్మ‌టం చ‌ట్ట వ్య‌తిరేక‌మ‌ని.. అలా ఎవ‌రు చేసినా శిక్షార్హులేన‌న్నారు. అలాంటి వాటిని త‌మ దృష్టికి తీసుకొస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

జీఎస్టీ ప‌న్ను త‌గ్గి ఉంటే త‌గ్గిన ధ‌ర‌కు.. కొత్త ధ‌ర‌ను రెండింటిని ప్రింట్ చేయాల‌ని.. జీఎస్టీలో ప‌న్ను రేటు పెరిగి ఉంటే ఈ మేర‌కు ఎమ్మార్పీ మార్పుల‌ను వ‌స్తువుపై త‌ప్ప‌నిస‌రిగా ముద్రించాల‌న్నారు. అలా చేయ‌క‌పోవ‌టం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌న్నారు.

జీఎస్టీని ఎవ‌రు వ‌సూలు చేయ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని చెబుతూ..

+ జీఎస్టీ నెంబ‌రు లేని వారు

+ ఏడాదికి రూ.20ల‌క్ష‌ల లోపు ట‌ర్నోవ‌ర్ ఉన్న వారు

+ కాంపోజిష‌న్ స్కీంలో చేరిన వ్యాపారులు

+ కాంపోజిష‌న్ స్కీం డీల‌ర్ అయితే ఆ విష‌యాన్ని బోర్డు ద్వారా తెలియ‌జేయాలి

+ తెలంగాణ రాష్ట్రంలో 23 వేల మంది వ్యాపారులు రిజిస్ట‌ర్ చేసుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 2.7ల‌క్ష‌ల మంది జీఎస్టీఐన్‌లో త‌మ వ్యాపార సంస్థ‌ల్ని న‌మోదు చేశారు.