Begin typing your search above and press return to search.
మిత్రపక్షం మోడీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందిగా
By: Tupaki Desk | 26 Oct 2017 5:45 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చిత్రమైన పరిస్థితి ఎదురవుతున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు - ఇతరత్రా నాయకుల కంటే మిత్రపక్షాల ద్వారానే ఊపిరి సలపనివ్వని పరిస్థితిని మోడీజీ ఎదురుకుంటున్నారని అంటున్నారు. ఇదంతా ప్రధాని మోడీ స్వరాష్ట్ర ఎన్నికల సందర్భంగా మిత్రపక్షమైన శివసేన గురించి. గుజరాత్ మోడల్ అభివృద్ధి దేశానికి ఆదర్శమంటూ గొప్పలుపోతున్న బిజెపి నాయకులు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం రకరకాల పథకాలు ప్రకటిస్తోందని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ మండిపడింది.
గుజరాత్ ను ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్న బీజేపీ ఎన్నికల వేళ రకరకాల తాయిలాలు - రాయితీలు ఎందుకు ఇస్తోందని శివసేన నిలదీసింది. సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో బీజేపీ నాయకత్వంపై విమర్శలు గుప్పించింది.‘నిజంగా గుజరాత్ ను మీరంత అభివృద్ధి చేసే ఉంటే ఈ హామీలేమిటి?’అని ప్రశ్నించింది. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే తాయిలాలు - రాయితీలు ప్రకటించాల్సిన అవసరం లేదని సేన ఎద్దేవా చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు పనిచేసిన నరేంద్ర మోడీ ప్రధానిగా కేంద్రానికి వెళ్లాక ఒక్క సెప్టెంబర్ నెలలోనే మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించారని సామ్నా పేర్కొంది. వివిధ పథకాలకు శంకుస్థాపనలు చేశారని...వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమనే మోడీ అన్ని సార్లు గుజరాత్‌కు వస్తున్నారని సేన విమర్శించింది. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే అంత భయపడాల్సింది లేదని బీజేపీ నేతలపై ధ్వజమెత్తింది.
తమ పార్టీలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని పటీదార్ నేత నరేంద్ర పటేల్ చేసిన ఆరోపణలను సైతం సామ్నా ఉపయోగించుకుంది. బీజేపీ నాయకత్వం అనేక ప్రలోభాలకు గురిచేస్తుందనడానికి పటేల్ కామెంట్లే ఉదాహరణగా సంపాదకీయంలో పేర్కొంది. ప్రజాదరణగల నాయకులను కొనుగోలు చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది శివసేన అసహనం వ్యక్తం చేసింది. రాజకీయాలను తమ గుప్పెట్లోనే పెట్టుకోవాలన్న విధానం దేశానికి పెద్ద ప్రమాదమని శివసేన హెచ్చరించింది. అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావని, మహారాష్ట్రంలో డబ్బులు వెదజల్లే శివసేనపై గెలిచారని సామ్నా సంపాదకీయంలో అసహనం వ్యక్తం చేసింది.