Begin typing your search above and press return to search.
కాకా అంటే.. ఆ స్పీకర్ కు కోపం వచ్చింది
By: Tupaki Desk | 19 Jun 2017 8:18 AM GMTమోడీ ఇలాకా అయిన గుజరాత్ రాష్ట్ర స్పీకర్ రాంలాల్ వోరాకు మర్యాదలంటే చాలా మక్కువన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఓపక్కన.. ప్రధాని మోడీ ఏమో.. వీఐపీ మర్యాదలేమీ వద్దని చెప్పటమే కాదు..కార్ల మీద ఉన్న ఎర్రబుగ్గుల్ని సైతం పక్కన పడేయించారు. కానీ.. సదరు స్పీకర్ గారికేమో మర్యాదల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకునే రకం కాదు.
మూడు రోజుల క్రితం ఆయన తన కొడుకును తీసుకొని గాంధీనగర్ సివిల్ ఆసుపత్రికి కంటి చికిత్స కోసం వెళ్లాడు. ఎర్రబుగ్గ లేని కారు కావటం.. ఆసుపత్రి ఎదుట కారు ఆపటంతో అక్కడి సెక్యురిటీ గార్డు కలుగజేసుకొని.. ఓ కాకా ఇక్కడ కారు ఆపకూడదని తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించాడు.
అయితే.. తనలాంటి వ్యక్తిని పట్టుకొని కాకా అని పిలుచుడేందని అనుకున్నారేమో కానీ.. వెంటనే ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. స్పీకర్ హోదాలో ఉన్న తనలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక సెక్యూరిటీ గార్డు కాకా అనటమేమిటి? అంటూ క్వశ్చన్ చేయటమే కాదు.. ఇలా చిన్నబుచ్చుతారా? అని ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారట.
స్పీకర్ గారి మైండ్ సెట్ ను అర్థం చేసుకున్న సదరు ఆసుపత్రి యాజమాన్యం.. కాకా అన్న సెక్యూరిటీ గార్డును ఉద్యోగం నుంచి పీకేశారు. ఓపక్క ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ ఏమో.. వీఐపీ కల్చర్ వద్దంటూ మొత్తుకుంటుంటే.. మరోవైపు వోరా లాంటోళ్లు మర్యాదలు ఏ మాత్రం తగ్గకూడదన్నట్లుగా వ్యవహరించటంపై పలువురు తప్పు పడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/