Begin typing your search above and press return to search.
బాబు - లోకేశ్ మోసాల్లో నెంబర్ 1 : గుడివాడ
By: Tupaki Desk | 11 Oct 2017 10:56 AM GMTఏపీ సీఎం చంద్రబాబు - ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ లు మోసాలు చేయడంలో నెంబర్ 1 అయ్యారని వైసీపీ సీనియర్ నేత గుడివాడ అమర్ నాథ్ దుయ్యబట్టారు. లక్ష ఇళ్లు ఇస్తున్నామని చంద్రబాబు - లక్ష ఉద్యోగాలు ఇస్తున్నామన్న లోకేశ్ ఇద్దరూ రాష్ట్ర ప్రజల్నిమోసం చేశారని దుయ్యబట్టారు. కొందరు మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చుట్టపుచూపుగా విశాఖ వస్తున్నారని, ఆయనకు నగరంపై ఎంతమాత్రమూ ప్రేమ లేదని దుయ్యబట్టారు. హుద్ హుద్ తుపాను వచ్చి మూడేళ్లయినా బాధితులకు సాయం అందలేదని అన్నారు.
విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ను టీడీపీ దెబ్బతీస్తోందని విమర్శించారు. విశాఖలో భూదందా పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ వల్ల ఇటు భూములు కోల్పోయిన బాధితులకు గాని, ప్రభుత్వానికి గాని ఎటువంటి ఉపయోగం లేదన్నారు. చంద్రబాబు విశాఖను వాడుకున్నారే తప్ప ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మెడ్ టెక్ భూముల కుంభకోణం పై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒక పక్క ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినా పనులు మాత్రం ఆపకుండా ముందుకు వెళ్తున్నారని, దీనిలో ఏదో తిరకాసు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బాబు - లోకేశ్ ల పాలన పేదలకు అశనిపాతంగా పరిణమించిందని దుయ్యబట్టారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్ ప్రస్తుతం ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలకు అందడం లేదని, కేవలం ప్రచార ఆర్భాటం కోసమే తండ్రీ కొడుకులు కూడబలుక్కుని పని చేస్తున్నట్టుగా ఉందన్నారు. విపక్షం ఏ సమస్యను ప్రస్తావించినా.. బాబు మాటల దాడి తప్ప.. ఆ విషయంపై నిజాయితీగా స్పందించడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ తండ్రీ కొడుకులను భరించలేమని ప్రజలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారని దుయ్యబట్టారు.