Begin typing your search above and press return to search.
గుడివాడా...ఇక కాసుకో..?
By: Tupaki Desk | 26 April 2022 3:26 AM GMTఅనకాపల్లి జిల్లాకు చెందిన కొత్త మంత్రి గుడివాడ అమరనాధ్ హాయిగా పదవిని అనుభవించాల్సిన వేళ వివాదాల్లోకి కూరుకుపోతున్నారు. కోరి మరీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ వ్యక్తిగతాల జోలికి పోవడం తప్పు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరైనా విమర్శలు చేసేది మూడు వివాహాలు చేసుకున్నారు అన్న దాని మీదనే.
దానికి పవన్ సహా చాలా మంది జనసేన నాయకులు ఈసరికే వివరణ ఇచ్చి ఉన్నారు. అయినా సరే అదే విషయాన్ని పదే పదే కెలకడం ద్వారా తాము తగ్గిపోతూ పవన్ని కూడా తగ్గించాలని చూడడమే వారి వాచాలత్వం. ఇక గుడివాడ అమరనాద్ పవన్ మీద తాజాగా మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. ఇక ఎవరైనా ఆయన రాజకీయ సిద్ధాంతాలా గురించి విమర్శించవచ్చు.
నిలకడ లేని పవన్ అని కూడా అనవచ్చు. అవన్నీ కూడా గుడివాడ అన్నారు. అంతటితో ఆగితే బాగుండేది. పవన్ బహు భార్యత్వం గురించి చెప్పారు. ఆయన ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సరిగ్గా ఇదే ఇపుడు జనసైనికులను ఒక్క లెక్కన మండించేస్తోంది.
దాంతో వారు గుడివాడ ఇక కాసుకో అంటున్నారు. మా నాయకుని జీవితం తెరచిన పుస్తకం అని కూడా అంటున్నారు. మిగిలిన నాయకుల మాదిరిగా చీకటి వ్యవహారాలు ఆయనకు లేవని అంటున్నారు. ఇక గుడివాడ విశాఖ జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఆయన భాగోతాలను ఒక్కొక్కటిగా బయట పెడతామని కూడా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా పవన్ ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతున్నారు. గుడివాడను సోషల్ మీడియా ద్వారా ఒక్క లెక్కన ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు పవన్ తో గుడివాడ అయిదేళ్ల క్రితం విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోను కూడా పెట్టి దీని మాటెంటి అని కూడా నిలదీస్తున్నారు.
ఆనాడు వైసీపీ విపక్షంలో ఉంది. గుడివాడ విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పవన్ విశాఖ ఎయిర్ పోర్టులో ఉంటే గుడివాడ వెళ్ళి కలిశారు, ఫోటో దిగారు అన్నది నాడు విపరీతమైన ప్రచారం అయింది. నాడు కూడా పవన్ వైసీపీని ఉత్తరాంధ్రా జిల్లాలలో టూర్లు చేస్తూ విమర్శలు చేస్తూ వచ్చారు.
ఆయన తిరిగి హైదరాబాద్ కి వెళ్ళిపోతున్న టైమ్ లో గుడివాడ ఎయిర్ పోర్టులో కలిశారు. దాంతో వైసీపీ నాయకులు కూడా దాని మీద గయ్యిమన్నారు. సరే ఇదంతా ఫ్లాష్ బ్యాక్. అనుకుంటే ఇపుడు పవన్ని గుడివాడ పవన్ని మితిమీరి విమర్శించడంతో జనసైనికులకు కాలి సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టేసి నీవు పవన్ ఫ్యాన్ ని కావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
మొత్తానికి గుడివాడ అయితే జనసైనికుల సెగను తట్టుకోలేకపోతున్నారు. పైగా జగన్ తనకు పొలిటికల్ గా ఇమేజ్ ఇచ్చారని, అలా కనుక చూస్తే పవన్ తనతో కూడా ఫోటో దిగి ఉండవచ్చు కదా అని కూడా అంటున్నారు. కానీ ఫోటో అబద్ధం చెప్పదు కదా. పవన్ పక్కన ఫోటోలో గుడివాడ హ్యాపీగా ఉన్న దాన్ని బట్టి చూస్తే ఈయనే ఆయనతో ఫోటో దిగారు అని జనసైనికులు గట్టిగా రిటార్ట్ ఇస్తున్నారు. సో గుడివాడని ఫుల్ గా టార్గెట్ చేయడానికి జనసేన రెడీ అయిందట. ఇక కాసుకో అంటున్నారు. చూడాలి మరి అదెలా ఉంటుందో.