Begin typing your search above and press return to search.

మంత్రి అనవసరంగా కెలుక్కుంటున్నారా ?

By:  Tupaki Desk   |   31 July 2022 2:30 PM GMT
మంత్రి అనవసరంగా కెలుక్కుంటున్నారా ?
X
మద్యనిషేధం..ఇదొక బ్రహ్మపదార్థం లాగ తయారైపోయింది. ఏ ప్రభుత్వం అయినా మద్యాన్ని పెద్ద ఆదాయ వనరుగానే పరిగణిస్తోంది. మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబునాయుడు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి చెప్పినా లేదా మరో ముఖ్యమంత్రి చెప్పినా అబద్ధాలు చెబుతున్నట్లే లెక్క. గుజరాత్ లో మధ్య నిషేధం ఉందని యావత్ దేశానికి తెలుసు. మరి కల్తీసారా తాగి రెండు రోజుల క్రితమే గుజరాత్ లో 40 మంది ఎలా చనిపోయారు ? నాలుగు రోజుల క్రితమే రు. 2 కోట్ల విలువైన మద్యం బాటిళ్ళను గుజరాత్ లోనే బుల్ డోజర్లతో తొక్కి ధ్వంసం చేసిన ఘటనలు న్యూస్ లో అందరు చూసిందే.

సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న గుజరాత్ లో కల్తీ సారా తాగి చనిపోవటం ఏమిటి ? కోట్ల రూపాయల విలువైన మద్యం బాటిళ్ళను ధ్వంసం చేయటం ఏమిటి ? ఇపుడిదంతా ఎందుకంటే మద్యనిషేధం అన్నది తమ మ్యానిఫెస్టోలో లేదని మంత్రి అమర్నాధ్ చెప్పారు. మద్యనిషేధం మ్యానిఫెస్టోలోనే కాదు, నవరత్నాల్లో కూడా ఉన్న విషయం అందరికీ తెలుసు. పైైగా బహిరంగంగా జగన్ హామీఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కొంచెం మాట మార్చి దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తానన్నారు. మామూలు జనాలు మద్యాన్ని తాగాలంటే షాక్ కొట్టేట్లుగా ధరలను పెంచేస్తానని కూడా చెప్పారు.

అయితే మంత్రి గమనించాల్సిందేమంటే మద్యాన్ని హోలుమొత్తంగా సమాజం యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఏదోరూపంలో మద్యం ఉండకూడదనే జనాలు కోరుకుంటారు. అయితే ఆదాయవనరుగా ప్రభుత్వం చూస్తుంది కాబట్టే మద్య నిషేధాన్ని ప్రభుత్వం పట్టించుకోదు. మద్య నిషేధం వల్ల కోల్పోయే వేలకోట్ల రూపాయలకు వెంటనే ప్రత్యామ్నాయం దొరకదు కాబట్టే మద్యాన్ని ప్రభుత్వం నిషేధించదు. అపుడు ఏదో ఊపులో ఓట్ల కోసం పార్టీ వేసిన ప్లానై ఉండొచ్చు.

ఈ నేపధ్యంలోనే మద్యనిషేధంపై మంత్రి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. లేకపోతే ఆచరణ సాధ్యం కాని విషయాన్ని ప్రస్తావించి జనాల ఆగ్రహానికి గురి కావాల్సొస్తుందని మంత్రి గ్రహించాలి. ఈ విషయంలో మంత్రులు జాగ్రత్తగా ఉండకపోతే వచ్చే ఎన్నికల్లో జనాల వ్యతిరేకతను ఎదుర్కోకతప్పదు. చెయ్యగలిగిందే చెప్పాలన్న విషయం మంత్రి గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది.