Begin typing your search above and press return to search.
పవన్.. ముందు సర్పంచ్ గా గెలిచి చూపించు!
By: Tupaki Desk | 17 Jan 2020 5:58 AM GMTఏపీలో బీజేపీతో కలిసి ‘మూడో ప్రత్యామ్మాయం’ ఏర్పాటు చేశామని చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ సెటైర్లు వేసింది. పవన్ కళ్యాణ్ కు ‘మూడు’కు అవినాభావం సంబంధం అని తాజాగా వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు.
పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని.. ఇప్పుడు ఏపీలో మూడో ప్రత్యామ్మాయం అంటున్నారని.. పవన్ కు మూడుకు అవినాభావం సంబంధం ఉందని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ సెటైర్లు వేశారు.వ్యక్తిత్వం, నిబద్ధత అనేవి పవన్ డిక్షనరీలో లేవనడానికి బీజేపీతో పొత్తే నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీతో కలిసిన పవన్.. ఆ పార్టీ ఏం హామీ ఇచ్చిందో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీతో పవన్ ఎలా పొత్తు పెట్టుకున్నాడని ప్రశ్నించారు.
పవన్ 2024లో గెలవడం కాదని.. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా లేదా ఎంపీటీసీగా గెలిచి చూపించాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ సవాల్ చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికలపై మాట్లాడాలన్నారు.సిద్ధాంతం లేని పవన్ అధికారం కోసమే బీజేపీతో కలిశారని ఆరోపించారు. బీజేపీ ఇస్తానన్న రాజ్యసభ కోసం కోసమే పవన్ ఆ పార్టీతో కలిశాడని ధ్వజమెత్తారు. పవన్ కెమెరా ముందుకంటే ప్రజల ముందు బాగా నటిస్తాడని విమర్శించారు.