Begin typing your search above and press return to search.
గుడివాడ అమర్ నాథ్ పై టీడీపీ సోషల్ ట్రోలింగ్
By: Tupaki Desk | 6 Sep 2019 4:03 PM GMTతమ్మిన సాప్ట్ వేర్ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ ప్రతినిధులను గుడివాడ అమర్ నాథ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారట. ఈ సందర్భంగా వైజాగ్ లో వెయ్యి మంది సాఫ్ట్ వేర్ ఫ్రొఫెషనల్స్ కు అవకాశాలు కల్పించే స్థాయిలో ఆఫీసును ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ఓకే చెప్పిందట. ఈ విషయాన్ని గుడివాడ అమర్ నాథ్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ దీనిపై తెలుగుదేశం పార్టీ ట్రోలింగ్ మొదలుపెట్టింది.
ఆ సంస్థకు సరైన వెబ్ సైట్ కూడా లేదని - వాళ్లు వెయ్యి మంది సాఫ్ట్ వేర్ లకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో కంపెనీని ఏర్పాటు చేయగలరా? అని తెలుగుదేశం వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో గుడివాడ అమర్ నాథ్ ను వారు ట్రోల్ చేస్తూ ఉన్నారు.
ఇక ఇదే సమయంలో గుర్తు చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..తెలుగుదేశం పార్టీ హయాంలో బోలెడన్ని ఎంవోయులు చేసుకున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు అని ప్రకటించారు. పెట్టుబడిదారుల సదస్సు అంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్లు చాలా హడావుడి చేశారు. అయితే అక్కడకు హాజరైందంతా డమ్మీ కంపెనీలే అని - ఆఖరికి కనీసం సూటూబూటు వేసుకోని రాని వారు కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడిదారులంటూ ఆ సదస్సులో నటించారని వార్తలు వచ్చాయి.
అందుకు తగ్గట్టుగా భాగస్వామ్య సదస్సులు అన్నీ బోగస్ అని ప్రజలందరికి అర్థం అయ్యింది. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రభుత్వంపై చేస్తున్న ట్రోలింగ్ గతంలో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రామాలను కూడా గుర్తు చేస్తూ ఉందని పరిశీలకులు అంటున్నారు.