Begin typing your search above and press return to search.
షాకింగ్.. గుడివాడ కేసీనోలపై ఐటీ శాఖ దృష్టి!
By: Tupaki Desk | 15 Dec 2022 3:06 PM GMTఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో పెద్ద ఎత్తున కోడి పందేలు, కేసినోలు, గుండాట నిర్వహించారని తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోవా తరహాలో గుడివాడలో కనీవినీ ఎరుగని రీతిలో కేసినోలు నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు చేతులు మారాయని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు గుడివాడ కేసీనో వ్యవహారంపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రధాన మీడియాలో సైతం ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది.
ఇప్పుడు మళ్లీ తాజాగా గుడివాడ క్యాసినో ఎపిసోడ్ మళ్లీ తెర మీదకు వచ్చింది. గుడివాడ క్యాసినో ఎపిసోడ్‌పై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దృష్టి సారించింది. గుడివాడ క్యాసినో విషయంలో సమాచారం అందించాల్సిందిగా టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఐటీ నోటీసులు ఇచ్చింది.
గతంలో గుడివాడ క్యాసినో అంశంపై కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై వివిధ సంస్థలకు టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)లతోపాటు కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఫిర్యాదుపై ఐటీ శాఖ స్పందించింది. కేసినో వ్యవహారంపై సమాచార సేకరణలో భాగంగా వర్ల రామయ్యను ఐటీ అధికారులు పిలిచారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19వ తేదీన విజయవాడలో ఐటీ అధికారులను వర్ల రామయ్య కలవనున్నారు.
కాగా కొడాలి నాని, వల్లభనేని వంశీల నేతృత్వంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని గతంలో టీడీపీ ఆందోళనలు కూడా చేపట్టింది. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సైతం గుడివాడలో పర్యటించి వివరాలు తెలుసుకుంది. కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాలులో ఆయన ముఖ్య అనుచరుడు కేసినోలు నిర్వహించారని టీడీపీ ఆరోపణలు చేసింది.
టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించిన సమయంలో ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ఈ వ్యవహారం పైన రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఐటీ టీడీపీ నేత వర్ల రామయ్యకు నోటీసులు జారీ చేసింది. కేసినోల వ్యవహారంపై ఆయనకు తెలిసింది చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న వర్ల రామయ్య విజయవాడలో ఐటీ అధికారుల ముందు హాజరుకానున్నారు.
వర్లతో పాటు ఫిర్యాదు చేసినవారందరికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొడాలి నాని, వల్లభనేని వంశీ మాత్రం గుడివాడలో ఎలాంటి కేసినోలు జరగలేదని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కేవలం కోడి పందేలు మాత్రమే నిర్వహించారని చెప్పిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.