Begin typing your search above and press return to search.

వివాదాల‌కు కేంద్రంగా గుడివాడ‌.. ఎవ‌రికి న‌ష్టం..?

By:  Tupaki Desk   |   26 Dec 2022 6:21 AM GMT
వివాదాల‌కు కేంద్రంగా గుడివాడ‌.. ఎవ‌రికి న‌ష్టం..?
X
గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం.. ఇటీవ‌ల కాలంలో వివాదాల‌కు కేంద్రంగా మారిపోయింది. ఒక‌ప్పుడు.. అన్న‌గారి పుట్టిన ప్రాంతంగా.. గుడివాడ ప్ర‌పంచ పుట‌ల్లోకి ఎక్కింది. ఇక్క‌డి వారిలో అక్కినేని నాగేశ్వ‌రావు, కొంచెం దూర ప్రాంత‌మైన‌ప్ప‌టికీ.. అన్న‌గారి పుట్టిన ఊరు(పామ‌ర్రు ప‌రిధిలోని నిమ్మ‌లూరు) ఉన్నాయ‌ని గ‌ర్వంగా చెప్పుకొనే వారు. కానీ, రాను రాను గుడివాడ తీరు వివాదాల‌కు కేంద్రంగా మారిపోయింది.

ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌నే భ‌యం కూడా ఇక్క‌డివారిని వేధిస్తోంది. రాజ‌కీయంగా మ‌రింత దూకుడు ఇక్క‌డ క‌నిపిస్తుండ‌డం.. ఎవ‌రు ఎప్పుడు వ‌చ్చి భ‌య‌పెడ‌తారో.. వేధిస్తారో.. అనే భ‌యాలు ఇక్క‌డ క‌నిపిస్తున్నాయి. ఇక‌, సంక్రాంతి, ద‌సరా వంటి సంప్ర‌దాయ పండుగ‌లు వ‌స్తే.. క్యాసినో.. జూదాలు... కోడి పందేల‌కు ఈ ప్రాంతం అడ్డాగా మారిపోయింద‌ని అంటున్నారు.

మ‌రి ఒక‌ప్పుడు ఎన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తోనో ఉన్న గుడివాడ నేడు ఇంత వివాదానికి కార‌ణం కావ‌డం ఏంటి? అనేది చూస్తే.. టీడీపీ నేత‌లు చెబుతున్న దానిని బ‌ట్టి.. మాజీ మంత్రి కొడాలి నాని అనుచ‌ర‌గ‌ణ‌మేన‌ని అంటున్నారు. నాని ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం ఉన్నా లేకున్నా.. ఆయ‌న అనుచ‌రులు మాత్రం ఇక్క‌డ హడావుడి సృష్టిస్తున్నారు. ఆదివారం జ‌రిగిన వివాదంలో ఏకంగా పెట్రోల్ సంచుల‌ను వినియోగించ‌డం చూస్తే.. ఖ‌చ్చితంగా ఇది వ్యూహాత్మ‌కంగా జ‌రిగిందే.

ప‌క్కా ప్లాన్ తోనే టీడీపీ కార్యాల‌యాన్ని త‌గుల బెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఇది వాస్త‌వానికి రాజకీయంగా పైచేయి సాధించేందుకు మాజీ మంత్రి అనుచ‌రులు చేసినా.. చివ‌ర‌కు ఇది నాని మెడ‌కు చుట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌శాంతంగా ఉన్న గుడివాడను వివాదాల‌కు కేరాఫ్ గా మారుస్తున్నార‌ని ప్ర‌జ‌లు భావిస్తే.. అది ఆయ‌న‌కే మోసం చేస్తుంద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.