Begin typing your search above and press return to search.
అట్టుడుకుతున్న గుడివాడ.. వేడెక్కిన 'రంగా రాజకీయం!' తమదగ్గరా రాళ్లున్నాయన్న టీడీపీ
By: Tupaki Desk | 26 Dec 2022 9:11 AM GMTఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన గుడివాడ నియోజకవర్గం ఆదివారం నుంచి అట్టుడుకుతోంది. కాపు నాయకుడు, దివంగత వంగవీటి రంగా వర్ధంతి(డిసెంబరు 26)ని పురస్కరించుకుని టీడీపీ నాయకులు ఇక్కడ కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. వీరిని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు, ముఖ్యంగా గెడ్డం గ్యాంగ్ గా పేరున్న కాళి అనుచరులు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
వాస్తవానికి దీనికి ముందు.. ఆదివారం సాయంత్రమే.. టీడీపీ గుడివాడ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసిన కాళీ నిన్ను చంపేస్తాం! అని హెచ్చరించినట్టు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఇంతలోనే పార్టీ కార్యాలయంపైకి కాళీ తన అనుచరులతో దూసుకువచ్చారు. పెట్రోల్ సంచులతో హంగా మా సృష్టించారు. ఈ క్రమంలో రావిని చంపేస్తున్నారంటూ.. టీడీపీ నాయకులు తీవ్రస్తాయిలో ఆందోళనకు దిగారు.
ఈ పరిణామాలతో అసలు గుడివాడలో ఏం జరుగుతోందనే విషయం గందరగోళానికి దారితీసింది. ఇంత లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు తమకు వ్యతిరేకంగా వ్యవహరించారని.. తమ వారిపైనే లాఠీ చార్జి చేశారని.. టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు.. వైసీపీ నాయకుడు కాళీ .. పోలీసులపై చేయిచేసుకున్నట్టు తెలిసింది. మొత్తంగా చూస్తే.. రంగా కేంద్రంగా.. గుడివాడ రాజకీయం ఒక్కసారిగా భగ్గు మంది.
ఇక, ఘటన పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో కొడాలి నాని హస్తం ఉందని ధ్వజమెత్తారు. గడ్డం గ్యాంగ్ కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆ గ్యాంగ్ కు గుండు కొట్టించే రోజు అతి దగ్గరలోనే ఉందని అన్నారు. తమ దగ్గర కూడా రాళ్లు ఉన్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.