Begin typing your search above and press return to search.
గుజరాత్ పై ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి తీపికబురేనా?
By: Tupaki Desk | 14 Dec 2017 3:46 AM GMTప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండోది, చివరి దశ పోలింగ్ కు అంతా సిద్ధమైంది. 93 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతతో పాటు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 851 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో 69 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 4 కోట్ల 35 లక్షల మంది ఓటర్లకు గాను రెండో ఫేజ్ లో 2 కోట్లకు పైగా జనం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీజేపీ మొత్తం 93 స్థానాలకు పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 91 స్థానాల్లో పోటీలో ఉంది. గుజరాత్ ఎన్నికల్లో మొత్తంగా 50 కి పైగా పార్టీలు పోటీ చేస్తుండటం విశేషం.
అయితే రెండో దశ పోలింగ్ కు ముందే..పలు ఎగ్జిట్ పోల్స్ తెరమీదకు వస్తున్నాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పార్టీ కన్నేసినట్లు 150 సీట్లు గెలవలేదని 100 సీట్లు దక్కించుకుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ ఈ దఫా బలోపేతం అవుతుందని సర్వేలు చెప్తున్నాయి. సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ 110 స్థానాల్లో గెలువనుండగా...కాంగ్రెస్ 70 సీట్లలో గెలుచుకోనుంది. టైమ్స్ నౌ-వీఎంఆర్ ప్రకారం బీజేపీ 106 నుంచి 116 - కాంగ్రెస్ కు 91 నుంచి 96 సీట్లు రానున్నాయి. సీఓటర్-టీవీ9 ప్రకారం 109 స్థానాలు బీజేపీకి రానున్నాయి. లోక్ నీతి-సీఎస్ డీఎస్-ఏబీపీ ప్రకారం బీజేపీకి 91-99 సీట్లు దక్కనున్నాయి.
స్థూలంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే ఓట్ల శాతం - సీట్లు తగ్గినప్పటికీ... అధికారం మాత్రం తిరిగి ఆ పార్టీకే దక్కనుందని దాదాపుగా అన్ని సర్వేలు తేలుస్తుండటం గమనార్హం. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం మునుపటి కంటే బలోపేతం అవడం గమనార్హం.
కాగా,ఎలాగైనా మళ్లీ గుజరాత్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావటంతో ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు - గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన పథకాలను మోడీ పదేపదే ప్రజలకు గుర్తు చేశారు. దీనికి తోడు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై విమర్శలకు దిగారు ప్రధాని మోడీ. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాక్ విదేశాంగ మంత్రితో సమావేశం కావటాన్ని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించారు. ప్రధాని సొంత రాష్ట్రంలో ఆయన్ని ఓడించాలని శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ప్రచారంలో మోడీని టార్గెట్ చేసేందుకు వచ్చిన అన్ని అవకాశాలను వాడుకున్నారు. పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ ను సైతం కలుపుకొని వెళ్లారు. ప్రధాని మోడీ కొంతమంది బడా పారిశ్రామిక వేత్తల కోసమే పనిచేస్తున్నారని ప్రచారంలో విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో జబర్దస్త్ ఫలితాలు రావటం ఖాయమని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నెల 18 న ఫలితాలు ప్రకటించనున్నారు.