Begin typing your search above and press return to search.
గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ః ఫలితాల్లో...గ్రేట్ ట్విస్ట్
By: Tupaki Desk | 14 Dec 2017 3:30 PM GMTపార్టీలకు - ప్రాంతాలకు అతీతంగా...దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. అన్ని సంస్థలు కూడా ఒకేమాట వినిపిస్తుండటం - అది గతంలో కంటే భిన్నంగా ఉండటం విశేషం. ఈసారి కూడా గుజరాత్ బీజేపీదే అని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే కాంగ్రెస్ ఈసారి గట్టి పోటీనే ఇవ్వనున్నట్లు తెలిపింది. సీఎన్ ఎన్ ఐబీఎన్ సర్వే చూస్తే బీజేపీకి 109 - కాంగ్రెస్ కు 70 సీట్లు రానున్నట్లు తేల్చింది. సీఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం మొత్తం 182 సీట్లకు గాను బీజేపీకి 108 - కాంగ్రెస్ 74 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సహారా సమయ్ గుజరాత్ లో బీజేపీకి 110 నుంచి 120 - కాంగ్రెస్ కు 65 నుంచి 75 సీట్లు రానున్నట్లు అంచనా వేసింది. టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 109 - కాంగ్రెస్ కు 70 - ఇతరులకు 3 సీట్లు రానున్నాయి.
ఇక ప్రాంతాల వారీగా చూస్తే...ఉత్తర గుజరాత్ లో కాంగ్రెస్ కు 19 - బీజేపీకి 13 సీట్లు రానున్నట్లు సీఓటర్ చెప్పింది. సౌరాష్ట్రలో బీజేపీకి 37 - కాంగ్రెస్ కు 17 సీట్లు రానున్నట్లు అంచనా వేసింది. మధ్య గుజరాత్లో బీజేపీకి 39 - కాంగ్రెస్ కు 24 సీట్లు రానున్నట్లు సీఓటర్ స్పష్టంచేసింది. దక్షిణ గుజరాత్ లో బీజేపీకి 19 - కాంగ్రెస్ కు 14 సీట్లు రానున్నట్లు అంచనా. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే బీజేపీకి 47.4 శాతం - కాంగ్రెస్ కు 43.3 శాతం ఓట్లు వచ్చినట్లు సీఓటర్ తెలిపింది. 2012లో బీజేపీ 115 - కాంగ్రెస్ 61 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.
అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేస్తున్నాయి. హిమాచల్ లో మొత్తం 68 సీట్లకుగాను.. బీజేపీకి 41 - కాంగ్రెస్‌కు 25 రానున్నట్లు సీఓటర్ అంచనా వేసింది. ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ను బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం 68 సీట్లకుగాను బీజేపీకి 51 - కాంగ్రెస్ కు 17 సీట్లు రానున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఇక ఏబీపీ న్యూస్-సీఎస్ డీఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 47 నుంచి 55 - కాంగ్రెస్ కు 13 నుంచి 20 సీట్లు రానున్నట్లు అంచనా. గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 18న అంటే సోమవారం వెల్లడి కానున్నాయి.