Begin typing your search above and press return to search.
ఈ గుజరాతీ.. ప్రపంచ సంచలనం!
By: Tupaki Desk | 25 Oct 2018 10:22 AM GMTసావ్ జీ ఢోలాకియా.. ఈయన సూరత్‌కు చెందిన బిలియనీర్. డైమండ్ల బిజినెస్. ఏడాదికి వందల కోట్ల ఆదాయం. కానీ ఈయన అందరిలాంటి వ్యాపారవేత్త కాదు. డబ్బు సంపాదనలో ఉండే కష్టనష్టాలను తెలియజెప్పడానికి తన కొడుకుతో ఓ సాధారణ ఉద్యోగం చేయించారు. లాభాలన్నీ తానే అనుభవించకుండా.. తన ఉద్యోగులకూ వాటి ఫలాలను అందజేస్తారు. సూరత్‌కు చెందిన బిలియనీర్ డైమండ్ వ్యాపారి సావ్‌జీ ఢోలాకియా ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా తమ ఉద్యోగులకు దీపావళికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు.
హరే కృష్ణ ఎక్స్‌పోర్టర్స్ యజమాని అయిన ఢోలాకియా.. ఈ ఏడాది 600 మంది ఉద్యోగులకు దివాలీ గిఫ్ట్‌లు సిద్ధం చేశారు. ఇక మరికొందరు ఉద్యోగులకు నగలు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సంస్థలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఢోలాకియా ఏకంగా మెర్సెడీజ్ బెంజ్ జీఎల్ ఎస్ 350డీ ఎస్ యూవీలను గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లు. కంపెనీలో అత్యుత్తమంగా పని చేసిన ఉద్యోగులకు గతంలోనూ వేల కొద్దీ కార్లు - ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు ఢోలాకియా. హరేకృష్ణ ఎక్స్ పోర్టర్స్ లో దీపావళికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీ జిల్లా దుదాలా గ్రామానికి చెందిన ఢోలాకియా.. తన మామ దగ్గర అప్పు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నారు. గతంలో ఈయన కొడుకే కేరళలో నెల రోజుల పాటు ఓ సాధారణ వ్యక్తి జీవితం గడిపి వార్తల్లో నిలిచాడు. తన అంకుల్ చేసిన సాయంతో చిన్నగా ఈ డైమండ్ల వ్యాపారం మొదలుపెట్టిన ఢోలాకియా.. ఇప్పుడు వందల కోట్లకు అధిపతి. ఇదేమీ రాత్రికి రాత్రి సంపాదించింది కాదు. ఎన్నో కష్టనష్టాల కోర్చి సంపాదించింది. అందుకే డబ్బు విలువ ఏంటో తెలియజెప్పడానికి తన కుమారుడు ద్రవ్యా ఢోలాకియాను కొచ్చికి పంపించారు. కేవలం రూ.7 వేలు ఇచ్చి, తన పేరు ఎక్కడా వాడుకోకుండా నెల రోజుల పాటు ఏదైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని అతనికి షరతు విధించారు.