Begin typing your search above and press return to search.
గుజరాత్ లో 140 మంది బలి.. అసలు జరిగింది ఇదే!
By: Tupaki Desk | 31 Oct 2022 12:56 AM GMTగుజరాత్ లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నది పై వేలాడే తీగల వంతెన (కేబుల్ బ్రిడ్జి) కూలి 140 మంది అశువులు బాశారు. ఆ సమయంలో మొత్తం 400 మందికి పైగా ఆ వంతెనపై ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
140 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై బ్రిటిష్ వాళ్లు ఈ వంతెనను నిర్మించారు. పర్యాటక ఆకర్షణగా నిర్మించిన ఈ వేలాడే వంతెనను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఘటన జరిగిన రోజు ఆదివారం కావడంతో భారీ ఎత్తున పర్యాటకులు విహారానికి తరలివచ్చారు.
కాగా 140 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు చేశారని చెబుతున్నారు. దాదాపు రూ.2 కోట్లతో ఏడు నెలలపాటు పనులు నిర్వహించారని తెలుస్తోంది. ఆ సమయంలో పర్యాటకులను నిషేధించారు. మరమ్మతులు పూర్తయ్యాక కొద్ది రోజుల క్రితమే పర్యాటకులను ఈ వేలాడే వంతెనపైకి అనుమతించారు.
దీనిపై కొద్ది రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీలోనూ వాదోపవాదాలు జరిగాయి. వంతెన పటిష్టంగా ఉందో, లేదో తెలుసుకోకుండా పర్యాటకులను అనుమతిస్తే ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని పలువురు సభ్యులు హెచ్చరించారు. అయితే భయపడాల్సిందేమీ లేదని అంతా బానే ఉందని ప్రభుత్వం ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చింది.
అక్టోబర్ 26న గుజరాత్ కొత్త సంవత్సరం కావడంతో ఆ వంతెనను తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం భారీ ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే అని చెబుతున్నారు. మొత్తం 400 మందికి పైగానే సందర్శకులు రాగా ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు వేలాడే వంతెన ప్రమాదవశాత్తూ తెగి కుప్పకూలింది. దీంతో వంతెన రెండుగా చీలిపోయింది.
ఈ ఘటనలో 100 మీటర్ల ఎత్తు నుంచి అంతా మచ్చూ నదిలో పడిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే ఆదివారం అర్ధరాత్రి సమయానికి నీట మునిగి 140 మంది కన్నుమూశారు. వీరిలో అత్యధికులు మహిళలు, పిల్లలే కావడం గమనార్హం. చాలా మంది గాయపడ్డారు. సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఈ వంతెనపై చేరడమే ఘటనకు కారణమని చెబుతున్నారు. కాగా మరమ్మతుల తర్వాత వంతెనకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇంకా అందలేని మున్సిపల్ అధికారులు తెలిపారు.
వంతెన పున: ప్రారంభమైన నాలుగు రోజులకే ఘోర విషాదం జరగడం అందరినీ నివ్వెరపరిచింది. 140 ఏళ్ల క్రితం ఈ వేలాడే వంతెనను 1879లో అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీని పనులను ప్రారంభించారు. 1880లో వంతెన నిర్మాణం పూర్తయింది. ఇందుకు అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చయ్యాయి.
కాగా ఈ వేలాడే వంతెన పొడవు 765 అడుగులు, వంతెన వెడల్పు 1.25 మీటర్లు. కాగా ఈ వేలాడే వంతెన మోర్బీ పట్టణంలోని దర్బార్‌గఢ్, నజార్‌బాగ్ ప్రాంతాలను కలుపుతుంది. దీన్ని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలోనూ చేర్చారు.
కాగా 1979లో మోర్బీ పట్టణంలోనే మచ్చూ నదిపై నిర్మించిన డ్యామ్ తెగిపోయింది. దీంతో వరద నీరు పట్టణాన్ని ముంచెత్తింది. ఈ విపత్తులో 2000 మందికిపైగా మరణించారు.
మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు నష్టపరిహారం ప్రకటించాయి. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.