Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రులకు యమగండం
By: Tupaki Desk | 28 May 2017 6:03 AM GMTదేశంలోని ముఖ్యమంత్రులకు యమగండం నడుస్తోందట. ఇది మరో వారం రోజుల పాటు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దారుణ హెలికాప్టర్ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. అది ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే తాజాగా మరో సీఎం కూడా కొద్దిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా పెను ప్రమాదం జరిగేదంటున్నారు. దీంతో సీఎంలకు యమగండం ఉందన్న ప్రచారం ఒకటి మొదలైంది.
గుజరాత్ సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇంజిన్ అధికంగా వేడి కావడం వల్లే హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్‌పోర్టు వర్గాలు చెప్తున్నాయి. ఉమర్‌గామ్ నుంచి హిమ్మత్‌నగర్ వెళ్తుండగా హెలికాప్టర్ ఇంజిన్ వేడెక్కడం మొదలైందని, దీంతో సమీపంలో ఉన్న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బలవంతంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
కాగా తాజా పరిణామాలతో గ్రహాలు, గండాలు, వాస్తులు, జాతకాలను బాగా నమ్మే సీఎంలు కొందరు వెంటనే తమ ఆస్థాన పండితులను పిలిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. తమకేమైనా ప్రమాదం ఉందా.. తామెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయంలో జ్యోతిష్యుల సలహాలు తీసకుంటున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/