Begin typing your search above and press return to search.
రెండో పెళ్లి: గుజరాత్ కోర్టు సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 6 Nov 2015 9:27 AM GMTఒక హిందువు రెండో పెళ్లి చేసుకుంటే చట్టప్రకారం నేరం. అదే ఒక ముస్లిం రెండు పెళ్లిళ్లు చేసుకుంటే దేశంలో అమలు అవుతున్న ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఎలాంటి నేరం కాదు. దీనిపై ఇప్పటి వరకూ ఎవరూ పెద్దగా చర్చ రేపింది లేదు. ఒక దేశంలో ఉండే ప్రజలకు రెండు వేర్వేరు చట్టాలు ఏమిటి? మతాల ఆధారంగా చట్టం ఏమిటన్న వాదన ఎవరైనా చర్చకు తీస్తే.. వారిని హిందుత్వవాదిగా, ఆర్ ఎస్ ఎస్ వాదిగా చూస్తారే తప్పించి.. ఒక దేశంలో నివసించే పౌరులందరికి ఒకే చట్టం అమలయ్యే అవకాశాన్ని ఎందుకు కల్పించకూడదన్న మాటను చెప్పలేని పరిస్థితి. దీనిపై రాజకీయ పార్టీలు సైతం ఓటు బ్యాంకు రాజకీయాల్ని నడపటంతో ఈ అంశాన్ని చర్చించే ధైర్యం ఎవరూ చేయని పరిస్థితి.
ఒక హిందువుగా చేసేది నేరంగా చెబుతున్న కారణం.. ఒక ముస్లింకు నేరం కిందకు రాదని చెప్పటంలో అర్థం లేకున్నా.. రాజకీయ పార్టీలు అనుసరించే ద్వంద విధానాలతో అది నడిచిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చని చెప్పే చట్టాలను ఆదిమకాలం నాటివిగా చెబుతూ.. నేటి సామాజిక పరిస్థితుల్లో అలాంటి చట్టాలేమిటంటూ ప్రశ్నించటమే కాదు.. ఇది మంచిది కాదని.. అభివృద్ధికి నిరోధకమంటూ అభిప్రాయ పడటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసే అవకాశం ఎక్కువగా ఉంది.
తన భర్త రెండో పెళ్లి చేసుకోవటాన్ని నిరసిస్తూ అహ్మాదాబాద్ కు చెందిన ఒక ముస్లిం మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఈ కేసును విచారిస్తున్న గుజరాత్ జడ్జి జె.బి. పార్థివాలా తన అభిప్రాయం చెబుతూ.. ముస్లింలు ప్రస్తుతం అనుసరిస్తున్న చట్టాలు మహిళల అణిచివేతను ప్రోత్సహించేవిగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.
ఈ కారణంగా ముస్లిం మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పిన ఆయన.. ముస్లిం నాయకులు.. మౌల్వీలు.. కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హిందూ వివాహ చట్టం.. ముస్లిం లా మధ్యన వ్యత్యాసాల్ని ప్రశ్నించారు. హిందువుల కాలంతో పాటు మారారని వారి చట్టాలు చెబుతాయని.. అదే ముస్లింల పరిస్థితి ఇంకా పురాతన కాలంలో ఉన్నట్లుగా తనకు అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాల్ని ప్రశ్నించిన సదరు న్యాయమూర్తి తీర్పు చెప్పాల్సి వచ్చేసరికి మాత్రం చట్టం పరిధిని దాటకుండా.. ముస్లిం లాబోర్డులో ఉన్న చట్టం ప్రకారం.. రెండో పెళ్లి చేసుకున్న భర్తపై చర్య కోసం మొదటి భార్య దాఖలు చేసిన దరఖాస్తును కొట్టి వేశారు. చట్టం పరిధిని దాటేందుకు ప్రయత్నించని న్యాయమూర్తి.. ఈ తీర్పు చెప్పే క్రమంలో తన మాటలతో దేశంలో కొత్త చర్చకు తెర తీశారు. ఇక దీనిపై తుది తీర్పుకు సోపానం సోషల్ మీడియా నుంచే మొదలు కావాలి మరి !