Begin typing your search above and press return to search.
డిప్యూటీ సీఎం కుమారుడు మందేసి చిందేసి...
By: Tupaki Desk | 9 May 2017 7:41 AM GMTనేతల కుమారులు చేసే నీచపు పనులు తెలుగు రాష్ర్టాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ తక్కువేం కాదు. మన దగ్గర రోడ్డుపై వెళ్తున్న మహిళలను చేయిపట్టుకుని లాగినవారు... బ్యూటీషియన్లను పిలిచి అత్యాచారానికి యత్నించినవారు ఉన్నట్లే గుజరాత్ లోనూ ఓ బడా నేత కుమారుడు ఫుల్లుగా మందు కొట్టి వీరంగమాడేశాడు. విమానాశ్రయ సిబ్బందితో వాదన పెట్టుకున్నాడు.
గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ కుమారుడు జైమన్ పటేల్ (30) అహ్మదాబాద్ విమానాశ్రయంలో హల్ చల్ చేశాడు. ఫుల్లుగా మద్యం తాగి ఇష్టారీతిన ప్రవర్తించాడు. భార్యాబిడ్డలతో కలిసి గ్రీస్ వెళ్లేందుకు జైమన్ పటేల్ ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. వీల్ చెయిర్ లో కూర్చున్న జైమన్ పటేల్ ఇమ్మిగ్రేషన్ తనిఖీలు కూడా పూర్తి చేయించుకున్నారు. అయితే... ఆయన ఫుల్లుగా తాడి నడవలేని స్థితిలో ఉండడం వల్లే వీల్ చెయిర్లో కూర్చున్నారట. అయితే... మద్యం వాసన వస్తుండడంతో విమానంలో ఆయనను ఎక్కించేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆయన వారితో వాదనకు దిగారు. డిప్యూటీ సీఎం కొడుకునే ఆపుతారా? అంటూ వీరంగంవేసి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఈ వివాదం గుజరాత్ లో కలకలం రేపడంతో... దీనిపై నితిన్ పటేల్ వివరణ ఇస్తూ... తన కుమారుడు అనారోగ్యం కారణంగా నడవలేక వీల్ చెయిర్ లో కూర్చున్నాడని కవర్ చేయడానికి ట్రై చేశారు. అయితే... అక్కడున్నవారు మాత్రం నడవలేని స్థితిలో ఆయన గ్రీస్ ఎందుకు వెళ్తాడని... పైగా తాగి ఆగ్రహం వ్యక్తంచేయగలిగిన ఆయన నడవలేనిస్థితిలో ఏమీ లేరని చెబుతున్నారు.