Begin typing your search above and press return to search.
రాహుల్ కామెంట్: మోదీది మార్కెటింగ్ మోడల్
By: Tupaki Desk | 25 Nov 2017 6:13 AM GMTప్రధాని నరేంద్ర మోదీపై మాటల తూటాలు పేలుస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరోసారి రెచ్చిపోయారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ తన వ్యాఖ్యలకు మరింత పదును పెంచారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ గొప్పగా చెప్పుకొంటున్న గుజరాత్ మోడల్‌పై విరుచుకుపడ్డారు. గుజరాత్ మోడల్.. నరేంద్ర మోదీ మార్కెటింగ్ మోడల్ అంటూ విరుచుకుపడ్డారు. వాస్తవానికి గుజరాత్‌లో పదేళ్లపాటు సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకొంటారు. అంతేకాదు, ఈ మోడల్ మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆదర్శమని ప్రకటించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ గుజరాత్ మోడల్‌నే పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది.
నరేంద్ర మోదీ అభివృద్ధి చేసిన విధంగా ఎవరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని బీజేపీ ప్రముఖులు ప్రచారంలో దంచి కొడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సహా ఆ పార్టీ నేతలు ఇదే అంశాన్ని ప్రచారాస్త్రం చేసుకుని తిప్పి కొడుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రాహుల్.. గుజరాత్ మోడల్.. వాస్తవానికి నరేంద్ర మోదీ మార్కెటింగ్ మోడల్ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ``గుజరాత్‌లోని మహిళా శక్తిని వినియోగించుకుని చిన్న, మధ్యతరహా వ్యాపారాభివృద్ధికి, వారిలో ఆర్థిక, సామాజిక సాధికారతకు కృషి చేయాలి. అదేవిధంగా చుదువుకున్న యువతలోని శక్తిని వెలికితీసి రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలి. ఇది నిజమైన గుజరాత్ మోడల్. కానీ, గత 22 ఏళ్లుగా ఈ గుజరాత్ మోడల్ నాశనమై పోయింది`` అని రాహుల్ విమర్శించారు.
మూడేళ్ల కిందటి వరకు గుజరాత్‌లో నరేంద్ర మోదీ మోడల్ కనిపించగా ప్రస్తుతం సీఎం రూపానీ మోడల్ కనిపిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ ప్రశ్నించడం తొలిసారి మాత్రం కాదని రాహుల్ చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా గుజరాత్ మోడల్‌పై దుమ్మెత్తి పోశారు. ఇది నిజమైన గుజరాత్ మోడల్ కాదని, బీజేపీ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. అదేవిధంగా మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ సైతం గుజరాత్ అభివృద్ధిపై పలు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఏదేమైనా.. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతలుతమ ధాటిని పెంచడం గమనార్హం. మరి గుజరాత్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.