Begin typing your search above and press return to search.
గుజరాత్‌లో తొలివిడత పోలింగ్...ఎన్నో ట్విస్టులు
By: Tupaki Desk | 9 Dec 2017 6:02 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో తొలి విడత శాసనసభ ఎన్నికలు ముగిశాయి. తొలి విడత పోలింగ్‌లో 68 శాతం పోలింగ్ నమోదు అయినట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 14న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈనెల 18న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీకి ఈ ఫలితాల్లో నిరాశ తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి.
మరోవైపు పోలింగ్ సందర్భంగా పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాండ్.. బారాత్‌తో సందడి చేయాల్సిన సమయంలో ఈ కాబోయే దంపతులు కళ్యాణ కాంతులతో ఓటేశారు. గుజరాత్‌లోని బరూచ్‌లో ఈ ఘటన జరిగింది. వధూవరులు ఇద్దరూ ఎంతో సంతోషంతో ఓటింగ్‌లో పాల్గొన్నారు. గుజరాత్‌లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పెళ్లి ముహూర్తం కావడంతో ఆ టెన్షన్ ఏమాత్రం లేకుండానే ఈ కపుల్ ఇలా పోలింగ్ బూత్‌కు వచ్చేశారు. పెళ్లి కంటే ఓటే ఇంపార్టెంట్ అన్న సందేశాన్ని కూడా ఇచ్చింది ఈ జంట ! ఓ భారతీయ పౌరుడిగా ఓటు వేయడం తన బాధ్యత అని వరుడు చెప్పాడు. పెళ్లి కూతురు కూడా అంతే హ్యాపీగా ఓటేసింది. పెళ్లి రోజునే ఓటేశా... పోలింగ్ డే నా పెళ్లి రోజును మరింత స్పెషల్‌గా మార్చేసిందని వధువు కూడా పేర్కొంది. వాస్తవానికి గుజరాత్‌లో ఇప్పుడు మ్యారేజ్ సీజన్. మంచి ముహూర్తాలు ఇప్పుడే ఉన్నాయి. అక్కడ ఈ సీజన్‌లో సుమారు 25వేల వివాహాలు ఉన్నట్లు తాజాగా తెలిసింది. ఈ జంట కూడా ఆ ముహుర్తానికి తమ మ్యారేజీని ఫిక్స్ చేసుకుంది. కానీ ఓటు వేయడం మాత్రం అంతకన్నా ముఖ్యమైన బాధ్యత అని ప్రూవ్ చేసింది.
ఇదిలాఉండగా....గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని చోట్ల వీవీప్యాట్లు కూడా మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. పోర్‌బందర్, సూరత్, రాజ్‌కోట్‌లో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు ఎక్కువగా నమోదు అయ్యాయి. మొరాయిస్తున్న ఈవీఎంల స్థానంలో కొత్త మెషీన్లను ఏర్పాటు చేశారు. సూరత్‌లోని వరచ్చాకు కొత్త ఈవీఎంలను వెంటనే పంపినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. వాస్తవానికి అది సాంకేతిక సమస్య కాదు అని, ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌లో కొన్ని లోపాలు ఉంటాయని, ఓటింగ్‌కు ఎటువంటి సమస్య రాకుండా చూస్తున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరోవైపు పోర్‌బందర్‌లోని కాంగ్రెస్ అభ్యర్థి కొత్త రకమైన ఫిర్యాదు నమోదు చేశారు. ఈవీఎంలు బ్లాటూత్‌తో కనెక్ట్ అవుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి అర్జున్ మొద్వాడియా ఫిర్యాదు చేశారు. ఈవీఎంలతో మొబైల్ అనుసంధానం చేసిన చిత్రాలను ఆయన ఈసీకి పంపించగా...ఇందులో వాస్తవం లేదని తేల్చింది.
గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 110 స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లోనే విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు. తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరోవైపు భారత టెస్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా గుజరాత్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌కోట్‌లోని రవి విద్యాలయ బూత్‌లో పుజారా ఓటేశారు. గుజరాత్ శాసనసభ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 89 స్థానాల్లో వివిధ పార్టీలు, స్వతంత్రులు 977 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తొలివిడత ఎన్నికల బరిలో గుజరాత్ సీఎం విజయ్ రుపాని పోటీలో ఉన్నారు. ఈ నెల 14న మిగిలిన స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా...ఈ నెల 18న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.