Begin typing your search above and press return to search.

రేప్ బాధితురాలి సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   17 Feb 2017 8:11 AM GMT
రేప్ బాధితురాలి సంచలన నిర్ణయం
X
ఆమె ఒక రేప్ బాధితురాలు.. తనను రేప్ చేసిన వ్యక్తి వల్ల గర్భం దాల్చింది. ఆ వ్యక్తి మీద కేసు పెట్టి అతడు జైలుకు వెళ్లేలా చేసింది. ఓ దశలో అబార్షన్ కోసం పట్టుబట్టింది. కానీ ఇప్పుడు ఆమే స్వరం మార్చింది. తనను రేప్ చేసిన వ్యక్తి ఇంట్లోనే ఉంటానని కోర్టును అభ్యర్థించింది. వాళ్లే తన బిడ్డకు రక్షణ ఇవ్వాలంది. అక్కడే బిడ్డను కంటానని చెప్పింది. కోర్టు ఆమె అభ్యర్థనను మన్నించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని స్థానిక పోలీసులకు.. సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ అమ్మాయి మైనర్ గా ఉండగా కనిపించకుండా పోయింది. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అశ్విన్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి.. రేప్ చేసినట్లు బయటపడింది. రేప్ తర్వాత ఆ అమ్మాయి ఆ వ్యక్తితోనే ఉంటున్నట్లు కూడా తెలిసిందే. ఆ అమ్మాయి మైనర్ కావడంతో తల్లి కేసు పెట్టిన కేసు ప్రకారం అశ్విన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇటీవలే అబార్షన్ కోసం కోర్టును విన్నవించగా.. అప్పటికే ఆమె గర్భం దాల్చి 24 వారాలు పూర్తయిన నేపథ్యంలో అందుకు నిరాకరించింది.

ఐతే తాజాగా ఆ అమ్మాయి మరో విజ్నాపనతో కోర్టుకు వచ్చింది. తాను అశ్విన్ ఇంట్లోనే ఉంటానని.. అక్కడే బిడ్డకు జన్మనిస్తానని చెప్పింది. తన భర్తను తాను ప్రేమిస్తున్నట్లు కూడా ఆమె చెప్పడం విశేషం. కోర్టు ఆమె అభ్యర్థనను మన్నిస్తూ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని అశ్విన్ కుటుంబానికి ఆదేశాలిచ్చింది. బాధితురాలి రక్షణ బాధ్యతను సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించింది. బిడ్డ పుట్టే వరకు పర్యవేక్షిస్తూ ఆమెకు ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవాలని ఆదేశించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/