Begin typing your search above and press return to search.
పటేల్ రిజర్వేషన్ పై షాకింగ్ తీర్పు
By: Tupaki Desk | 5 Aug 2016 10:15 AM GMTఅగ్రవర్ణ రిజర్వేషన్ ఉద్యమాన్ని విజయవంతంగా జాతీయ స్థాయిలో వినిపించిన పటేల్ ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ లోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు - విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మే 1న ఆనందీ బెన్ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో కొత్త వివాదం మొదలైంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ గుజరాత్ పేరెంట్స్ అసోసియేషన్ తో పాటు పలువురు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం కన్నా దిగువనే రిజర్వేషన్లు ఉండాలని ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ఆర్డినెన్స్ అమలైతే - సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినట్లవుతుందని వారు తమ వాదన వినిపించారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆర్డినెన్స్ చెల్లదని తీర్పు ఇచ్చింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల రిజర్వేషన్ ఉద్యమంపై పడనుందని భావిస్తున్నారు.