Begin typing your search above and press return to search.
అచ్చు ముంబయి దాడి మాదిరే..!
By: Tupaki Desk | 27 July 2015 12:26 PM GMTతాజాగా పంజాబ్ లోని దీనానగర్ పోలీస్ స్టేసన్ పై దాడి ఘటనను చూస్తే.. దాదాపుగా ఏడేళ్ల క్రితం ముంబయిలో చోటు చేసుకున్న ఉగ్రదాడి గుర్తుకు రాక మానదు. 2611 ఘటనగా గుర్తుండిపోయిన ఉగ్రదాడిలో పాక్ నుంచి బయలుదేరి.. సముద్రమార్గం గుండా ముంబయిలోకి చేరుకొని..విచక్షణారహితంగా కాల్పులు జరిపిన భయానక ఉదంతం తరహాలోనే తాజా ఉగ్రదాడి జరగటం గమనార్హం.
కొద్దిరోజుల క్రితం.. ఉగ్రవాదులు దేశంపై విధ్వంసం సృష్టించవచ్చని.. పెద్దఎత్తున తెగబడవచ్చన్న సమాచారాన్ని నిఘా వర్గాలు అందించాయి. అయినప్పటికీ.. ఊహించని రీతిలో ఉగ్రవాదులు దాడులు చేపట్టారు.
ముంబయి ఉగ్రదాడి మాదిరే..తాజా దాడి సైతం.. పాక్ నుంచే ఉగ్రవాదులు బయలుదేరారు. సముద్రమార్గంలో ఒక పడవను స్వాధీనం చేసుకొని.. అతన్ని హతమార్చి.. ముంబయి మహానగరంలోకి ప్రవేశించారు.
తాజా ఘటనలో పాక్ నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాదులు.. గురుదాస్‌పూర్ లోని ఒక రెస్టారెంట్ లో యజమానిని బెదిరించి.. ఆయన కారును అపహరించారు. అనంతరం రహదారి మీద ఒక బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ముంబయి ఘటనలోనూ రోడ్డు మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ హోటళ్లు.. రైల్వే స్టేషన్.. ఆసుపత్రులపై దాడి చేయటం తెలిసిందే.
తాజా ఘటనలో రోడ్డు మీద బస్సు మీద దాడి జరిపిన ఉగ్రవాదులు.. అత్యాధునిక ఆయుధాలతో.. సైనిక దుస్తులతో..దీనానగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
అక్కడ విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో.. ఏడుగురు పోలీసులతో సహా మొత్తం పది మంది మరణించారు. ముంబయి ఘటనలో సైతం రోడ్డు మీద కాల్పులు జరుపుకుంటూ.. ఉగ్రవాదులు.. వేర్వేరు లక్షిత ప్రాంతాలపై దృష్టి పెట్టగా.. తాజా ఉదంతంలో మాత్రం అందరూ ఒకే జట్టుగా ఉన్నారని చెబుతున్నారు. ఉగ్రవాదుల బృందంలో ఒక మహిళ ఉందన్న వాదన వినిపిస్తోంది.
ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే.. గురుదాస్‌పూర్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన సమయంలో రైలు పట్టాల మీద పేలటానికి సిద్ధంగా ఉన్న బాంబుల్ని భద్రతాధికారులు గుర్తించారు. దీనిబట్టి.. పెద్ద ఎత్తున విధ్వంసం తలపెట్టాలని ఉగ్రవాదులు భావించినట్లుగా తెలుస్తోంది. ఇలా.. ముంబయి ఉగ్రదాడి.. పంజాబ్‌లో తాజా దాడి మధ్య చాలానే అంశాలు దగ్గరగా ఉండటం గమనార్హం. ముంబయి ఉగ్రదాడి ప్లాన్ నే కొద్దిపాటి మార్పులతో మరోసారి తెగబడినట్లుగా కనిపిస్తోంది.