Begin typing your search above and press return to search.
షాక్;ఆ ఉగ్రవాదికి 12 ఏళ్లుగా హైదరాబాదే అడ్డా
By: Tupaki Desk | 21 Oct 2015 4:28 AM GMTదేశంలో ఎక్కడ ఉగ్రవాద జాడ కనిపించినా దాని మూలాలు మాత్రం హైదరాబాద్ వైపే వేలెత్తి చూపిస్తుంటాయి. తాజాగా అదెంత నిజమో చెప్పే ఘటన ఒకటి బయటకు వచ్చింది. ప్రముఖ ఉగ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్న ఒక టెర్రరిస్ట్ 12 ఏళ్లుగా హైదరాబాద్ ను అడ్డాగా చేసుకొని బండి లాగిస్తున్నాడంటే హైదరాబాద్ ఉగ్రవాదులకు ఎంత అడ్డాగా నిలిచిందో ఇట్టే తెలుసుకోవచ్చు.
2003లో అహ్మదాబాద్ లో జరిగిన పేలుళ్లతో పాటు.. వివిధ ఉగ్రవాద కార్యక్రమాలకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గులాం జాఫర్ షేక్ ను తాజాగా గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్ట్ చేశారు.
గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ నుంచి ఫ్యామిలీతో హైదరాబాద్ కు వచ్చేసిన ఇతగాడు గత కొన్నేళ్లుగా బేగంపేటలో ఉంటున్నాడు. ఐఎస్ఐ.. జేషే మహమ్మద్.. లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్న జాఫర్ తాజాగా గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోద్రా అల్లర్లకు సంబంధించి ప్రతీకార దాడుల కోసం ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపిన జాఫర్ పన్నేండేళ్లుగా హైదరాబాద్ లో రహస్య జీవితం గడుపుతున్నట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన హైదరాబాద్ ను కానీ జెల్లెడ పడితే.. ఇలాంటి కరుడుగట్టిన తీవ్రవాదులు ఇంకెంతమంది బయటకు వస్తారో..?