Begin typing your search above and press return to search.
మోదీ స్టేట్ లో ట్రాఫిక్ ఫైన్లు సగానికి తగ్గాయి
By: Tupaki Desk | 11 Sep 2019 4:34 AM GMTరహదారి భద్రతే ముఖ్యమంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన నూతన మోటారు వాహన సవరణ చట్టం అమలు తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చట్టంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ తో పాటు లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం, హెల్మెట్లు ధరించకుండా బైక్ లతో రోడ్లపైకి రావడం - ట్రిపుల్ రైడింగ్ - సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడం... తదితరాలన్నింటికీ భారీ ఫైన్లే వేస్తున్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో ఎక్కడికక్కడ భారీ ఫైన్లు పడిపోతున్నాయి. అయితే ఈ చట్టాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వ పెద్ద - ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మాత్రం అమలు చేయడం లేదు. నిజమా? అంటే... నిజమే మరి. కేంద్రం నిర్దేశించిన ఫైన్లను సగానికి సగతం తగ్గించేసిన గుజరాత్ లోని రూపానీ సర్కారు... సగం ఫైన్లే విధిస్తామంటూ కొత్త పాట పాడుతోంది. మోదీ నిర్దేశించిన నిబంధనలు మోదీ రాష్ట్రంలో అమలు కావడం లేదని ఈ మాటతోనైనా ఒప్పుకోవాల్సిందే కదా.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్రం ఈ చట్టానికి సవరణ చేస్తే మంచిదే. అంతేకాకుండా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా... చట్టం అమలుపై నేరుగానే ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోయేది. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరించిన మోదీ సర్కారు... తాను రూపొందించిన చట్టాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలంటూ ఓ మెలిక పెట్టేసింది. ఈ మెలికతో ఇప్పుడు మోదీకే పెద్ద చిక్కొచ్చి పడింది. మోదీ సర్కారు చేసిన చట్టాన్ని ఆయన సొంత రాష్ట్రం గుజరాతే పాటించడం లేదు. పోనీ... గుజరాత్ లో ఏమైనా బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఉందా? లేదు కదా. మోదీ ప్రధాని అయ్యాక... ఆయన స్థానంలో ఓ మహిళ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా... ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీనే గెలిచింది కదా. ఆ గెలుపుతో మోదీ సన్నిహితుడిగా పేరున్న రూపానీ సీఎం అయ్యారు కదా. అంటే... మోదీ చట్టాన్ని మోదీ సొంత రాష్ట్రంలో మోదీ సన్నిహితుడే సీఎంగా ఉండి కూడా అమలు చేయడం లేదన్న మాట.
సరే... మోదీ సర్కారు నిర్దేశించిన కొత్త చట్టం మేరకు ఆయా ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎంతమేర ఫైన్ విధించారు... దానిని గుజరాత్ ప్రభుత్వం ఎంతకు తగ్గించిందన్న విషయాల్లోకి వెళితే...
% హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000 జరిమానా విధిస్తుండగా.. దానిని గుజరాత్ రూ.500కి తగ్గించింది.
% డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ. 5వేల జరిమానాను విధిస్తుండగా.. దానిని రూ.3వేలకు తగ్గించింది.
% సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది.
% ఆర్సీ - పీయూసీ - ఇన్సూరెన్స్ తదితర పేపర్లు లేకుంటే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది.
% ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1,000 జరిమానాను ఏకంగా రూ.100కి తగ్గించింది.
% వాహన కాలుష్యంపై రూ.10వేల జరిమానాను చిన్న వాహనాలకు రూ.1,000 - పెద్ద వాహనాలకు రూ. 3వేలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇలా ప్రతి అంశంలోనూ మోదీ సర్కారు నిర్దేశించిన జరిమానాను గుజరాత్ సర్కారు సగానికి సగం తగ్గించేసి అమల్లోకి తెచ్చేసింది. మొత్తంగా భారీ ఫైన్లు విధిస్తే తప్పించి ట్రాపిక్ నిబంధనలను పాటించే విషయంలో ప్రజలు మేల్కోరని మోదీ సర్కారు చెప్పిన మాటతో మోదీ సొంత రాష్ట్రంలోని బీజేపీ సర్కారే విబేధించిందని చెప్పక తప్పదు. మరి ప్రధాని సొంత రాష్ట్రమే కేంద్రం ఆదేశాలను పక్కాగా అమలు చేయకుంటే మిగిలిన రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయన్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. ఈ తరహా గుజరాత్ వైఖరిపై, గుజరాత్ వైఖరి తెలిసినా సైలెంట్ గానే ఉండిపోతున్న మోదీ వైఖరిపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ సెటైర్లు వచ్చి పడుతున్నాయి.