Begin typing your search above and press return to search.
గుజరాత్ రిపోర్టు: వరుస పెట్టి పవర్ లోకి వచ్చే బీజేపీ ఈసారి గెలుస్తుందా?
By: Tupaki Desk | 5 Nov 2022 5:32 AM GMTతిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ.. అదే పనిగా అధికారంలోకి వస్తున్న గుజరాత్ లో ఈసారి గెలుపు ఎవరిది? అన్నది ఆసక్తికరంగా మారింది. దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ.. అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించటమే కాదు.. బీజేపీకి ఆ రాష్ట్రాన్ని కంచుకోటగా మార్చటం తెలిసిందే.
బీజేపీ ఏలుబడిలో ఇప్పటికి రెండు దశాబ్దాల పాటు సాగిన వేళలో.. తాజాగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బదిలీకి ఉన్న అవకాశం ఎంత? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి తాజాగా నిర్వహించిన సర్వే రిపోర్టు ఒకటి ఆసక్తికరంగా మారింది.
డిసెంబరు ఒకటి.. ఐదో తేదీల్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇండియా టీవీ.. మ్యాట్రిజ్ ఓపీనియన్ పోల్ రిపోర్టు విడుదలైంది. దీని ప్రకారం మరోసారి గుజరాత్ పీఠాన్ని బీజేపీనే గెలుకుంటుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 119 స్థానాలు.. కాంగ్రెస్ కు 59 స్థానాలు.. ఆమ్ ఆద్మీ పార్టీకి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్న అంచనాను వెల్లడించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాల్ని సొంతం చేసుకున్న బీజేపీ.. ఈసారి ఏకంగా మరో 20స్థానాల్ని అధికంగా సొంతం చేసుకునే వీలుందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో 77 స్థానాల్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్.. ఈసారి ఎన్నికల్లో 22 స్థానాల్ని కోల్పోతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊపును.. ఉత్సాహాన్ని ఇస్తాయని చెబుతున్నారు.
ఈసారి అధికార బదిలీ ఖాయమన్న మాట ఒకవైపు వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా గెలుపు బీజేపీదే అంటూ విస్పష్టంగా పేర్కొన్న సర్వే ఫలితం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. ఇలాంటి సర్వేల్ని నమ్మాల్సిన అవసరం లేదని.. వాస్తవం ఏమిటో డిసెంబరు 8న తేలుతుందని చెబుతున్నారు.
ఈ సారి ఫలితం రోటీన్ కు భిన్నంగా ఉంటుందన్న మాట నిజమా? సర్వే రిపోర్టు నిజమా? అన్నది తేలాలంటే మరో నెల ఆగితే సరిపోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.